
నేషనల్ అథ్లెటిక్స్‌లో ప్రతిభ
పలమనేరు: పట్టణంలోని కేవీఎస్ వీధికి చెందిన గౌతమిప్రసాద్‌రెడ్డి కుమార్తె మోక్షితారెడ్డి నేషనల్ అథ్లెటిక్స్‌లో వివేష ప్రతిభ కనబరించింది. ఈనెల 24న గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలో జరిగిన 36వ సౌత్‌జోన్ జూనియర్ నేషనల్స్ అథ్లెటిక్ చాంపియన్ షిప్పు 2025లో అండర్–16 విభాగం లాంగ్ జంప్‌లో విజేతగా నిలచింది. నిర్వాహకుల చేతుల మీదుగా బంగారు పతకాన్ని అందుకుంది. బాలిక ప్రస్తుతం తొమ్మిదో తరగతి చదవుకుంటూ హైదరాబాద్‌లోని పుల్లెల గోపీచంద్ స్పోర్ట్స్ అకాడమీలో శిక్షణ పొందుతోంది. గతేడాది జరిగిన ఇదే క్రీడల్లో బాలిక గోల్డ్‌మెడల్ సాధించిన విషయం తెల్సిందే.