
86,700 పశువుల కొనుగోలుకు ఆమోదం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు 86,700 పశువులు కొనుగోలు చేసేందుకు జిల్లా కమిటీ ఆమోదం తెలిపిందని డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు గురువారం ఆమె విలేకరులతో మాట్లాడారు. డీఆర్‌డీఏ శాఖ ఆధ్వర్యంలో పేదరిక నిర్మూలన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. పెరుగుతున్న జనాభా అవసరాలకు అనుగుణంగా జిల్లాలో పశువుల పెంపకాన్ని, సంఖ్యను మరింతగా అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపడుతున్నట్టు వెల్లడించారు. జిల్లాలో ఎక్కువ ప్రైవేట్ డెయిరీలు, 35 ప్రభుత్వ బల్క్ మిల్క్ చిల్లింగ్ సెంటర్లు ఉన్నందున పాల ఉత్పత్తి అవసరం విరివిగా ఉందన్నా రు. ఈ పథకం విజయవంతంగా అమలుకు బ్యాంక్ లింకేజీ, సీ్త్ర నిధి, సీఐఎఫ్ అంతర్గత రుణా లు ఇంటర్నల్ లెండింగ్ వంటి పథకాలతో స్వయం సహాయక సంఘాల మహిళలకు నచ్చిన విధంగా ఆరోగ్యకరమైన పశువులు కొనుగోలు చేయవచ్చన్నారు.
సకాలంలో కౌంటర్లు
దాఖలు చేయండి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా రెవెన్యూ కేసులకు సంబంధించి జిల్లా ప్రధాన కోర్టులో సకాలంలో కౌంటర్‌లు దాఖ లు చేయాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ ఆదేశించారు. ఈ మేరకు గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ జిల్లా ప్రధాన కోర్టు లో నమోదైన రెవెన్యూ కేసులకు సకాలంలో కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. ఈ విషయంలో ఆర్‌డీవోలు, తహసీల్దార్లు అలసత్వం వహించరా దని ఆదేశించారు. జిల్లా ప్రధాన న్యాయ స్థానంలోని 14 కోర్టుల పరిధిలో రెవెన్యూ శాఖకు సంబంధించి 54 కేసులు నమోదైనట్లు తెలిపారు. ఈ కేసుల్లో 27 ఎక్స్‌పార్టీగా గుర్తించినట్లు చెప్పారు. వీటికి సంబంధించి వెంటనే కౌంటర్ దాఖలు చేయాలని తహసీల్దార్లను ఆదేశించారు. ప్రభు త్వ భూములు అన్యాక్రాంతం కాకుండా చూడా ల్సిన బాధ్యత తహసీల్దార్లదేనన్నారు. మండలాల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించి పూర్తి బాధ్యత తహసీల్దార్లు తీసుకోవాలన్నారు. ప్రస్తు తం ఎక్స్‌పార్టీగా ఉన్న కేసులన్నింటికీ రెండు రోజుల్లో రిటర్న్ స్టేట్‌మెంట్, కౌంటర్లు దాఖలు చేయాలన్నారు. జిల్లా కోర్టులోని రెవెన్యూ కేసులకు సంబంధించి తహసీల్దార్లను సమన్వయం చేసేలా వీఆర్‌వో కేడర్ సిబ్బందిని లైజన్ అధికారిగా నియమించనున్నట్టు తెలిపారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, డీఆర్‌వో మోహన్‌కుమార్ పాల్గొన్నారు.
వైఎస్సార్ సీపీ విస్తృత స్థాయి సమావేశం రేపు
సదుం: మండలంలోని ఎర్రాతివారిపల్లెలో పుంగనూరు నియోజకవర్గ స్థాయి వైఎస్సార్ సీపీ వి సృ ్తత స్థాయి సమావేశం శనివారం నిర్వహించను న్నట్టు పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 9.30కు నిర్వహించే ఈ సమావేశానికి పార్టీ కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి హాజరుకానున్నట్లు పేర్కొంది. రాష్ట్ర ముఖ్య నాయకులు, చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల నియోజకవర్గ సమన్యకర్తలు పాల్గొంటారని వెల్లడించింది.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. చిత్తూరులోని తన కార్యాలయంలో గురువారం ఆ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న కారణంగా సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయన్నారు. విష జ్వరాలు, డెంగ్యూ, డయేరియా వంటి కేసులు నమోదవుతున్నాయన్నారు. క్షేత్ర స్థాయిలోవ్యాధుల కట్టడికి చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు అనిల్, అనూష, నవీన్‌తేజ్‌రాయ్, జార్జ్, వేణుగోపాల్, జయరాముడు, రామ్మోహన్, శ్రీవాణి పాల్గొన్నారు.

86,700 పశువుల కొనుగోలుకు ఆమోదం