
సహకార సంస్థలు ఎంతో ఉపయోగకరం
చిత్తూరు కలెక్టరేట్ : సహకార సంస్థలు ప్రజలకు ఎంతో ఉపయోగకరమని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ జీవనజ్యోతి తెలిపారు. కళాశాలలో గురువారం సహకార సంస్థల అంతర్జాతీయ సంవత్సరం 2025పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ విద్యార్థులు సహకార సంస్థల ప్రయోజనాలను తెలుసుకుని ఇతరులకు తెలియజేయాలన్నారు. జిల్లా సహకార శాఖ అధికారిణి లక్ష్మి మాట్లాడుతూ సహకార బ్యాంకులు రైతులు, వ్యాపారులకు రుణాలను ఇస్తున్నాయన్నారు. ప్రస్తుతం సహకార బ్యాంకుల్లో ఆన్‌లైన్ సేవలు సైతం అందుబాటులో ఉన్నాయన్నారు. అనంతరం విద్యార్థులకు సహకార సంస్థల ప్రయోజనాలపై వ్యాసరచన, వక్తృత్వ పోటీలు నిర్వహించి విజేతలకు సర్టిఫికెట్‌లు, బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ చలపతి, కళాశాల వైస్ ప్రిన్సిపల్ నాగేంద్ర, అసిస్టెంట్ రిజిస్ట్రార్లు శ్రీనివాసులురెడ్డి, ప్రసాద్, చిత్తూరు కో–ఆపరేటివ్ బ్యాంక్ మేనేజర్ రఘుబాబు పాల్గొన్నారు.