
గుండె, నరాల వ్యాధులకు చికిత్స
చిత్తూరు రూరల్ (కాణిపాకం): గుండె, నరాల వ్యాధులకు చికిత్స అందించేలా చిత్తూరులో కేంద్రాన్ని నిర్వహించనున్నట్లు వేలూరుకు చెందిన నర్వి ఆస్పత్రి నిర్వాహకులు తెలిపారు. వారు గురువారం చిత్తూరు నగరం ప్రీతం ఆస్పత్రిలో హార్ట్ అండ్ న్యూరాలజీ స్పెషలిస్ట్ మెడికల్ క్యాంపు నిర్వహించారు. ఈ శిబిరం నెలకు రెండుసార్లు ఆసుపత్రిలో నిర్వహించి వైద్య పరీక్షలు చేస్తామని తెలిపారు. నర్వి ఆస్పత్రి నిర్వాహకులు శరవణన్ రామన్, వినాయక్ శుక్లా, జార్జ్, లోకేష్ పాల్గొన్నారు.
మామిడి పంటపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు) : మండలంలోని పాళెం పంచాయతీలో వున్న మామిడి తోటలోకి గురువారం తెల్లవారు జామున ఏనుగులు ప్రవేశించాయి. మామిడి చెట్ల కొమ్మలను విరిచివేశాయి. ఏనుగులు 20 రోజులుగా మండలంలో తిరుగుతూ పొలాలపై పడి పంటలను నాశనం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు వాపోతున్నారు.

గుండె, నరాల వ్యాధులకు చికిత్స