
కూలి పనులకెళ్తూ..!
రొంపిచెర్ల: ఆటోను గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొని మహిళ మృతి చెందగా మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బెంగళూరు– తిరుపతి జాతీయ రహదారిలో గురువారం ఉదయం చోటు చేసుకుంది. బాధితుల కథనం.. రొంపిచెర్ల మండలం, రామచంద్రాపురం కాలనీ, మూరేవాండ్లపల్లె, పిచ్చిగుంట్లవారిపల్లె గ్రామాలకు చెందిన మహిళలు అన్నమ్మయ్య జిల్లాలోని కలకడ మండలంలో టమాట తోటల్లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం ఆ మూడు గ్రామాలకు చెందిన 14 మంది మహిళలు ఆటోలో కలకడకు బయల్దేరారు. నేషనల్ హైవేలోని బోనంవారిపల్లె సమీపంలో ఆటోను పీలేరు వైపు నుంచి వస్తున్న గుర్తుతెలియని ట్రాక్టర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పిచ్చిగుంట్లవారిపల్లెకు చెందిన అలివేలమ్మ (53) మృతి చెందారు. అలాగే మూడేవాండ్లపల్లెకు చెందిన పీ.రత్నమ్మ, పీ.లక్ష్మీదేవి, పీ.శాంతమ్మ, టీ.నారాయణమ్మ, పీ.కమలమ్మ, పీ.నారాయణమ్మ, రామచంద్రాపురం కాలనీకి చెందిన పీ.రాణి, ఎం.రాములమ్మ, పిచ్చిగుంట్లవారిపల్లెకు చెందిన రాజేశ్వరి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని రొంపిచెర్ల ఎస్‌ఐ సుబ్బారెడ్డి పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రొంపిచెర్ల పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బాఽధితులను పరామర్శించిన జెడ్పీటీసీ
క్షతగాత్రులను జెడ్పీటీసీ రెడ్డిశ్వర్‌రెడ్డి పరామర్శించా రు. ఆయన నేరుగా పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేరు కుని బాధితులను పరామర్శించి, అండగా ఉంటా మని భరోసానిచ్చారు. అనంతరం ఈ విషయాన్ని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి తెలయజేశారు. బాధితులకు దగ్గరుండి మెరుగైన వైద్యం అందేలా చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే ఆదేశించారు.
మృతురాలు అలివేలమ్మ
గాయపడిన మహిళలు
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులు

కూలి పనులకెళ్తూ..!

కూలి పనులకెళ్తూ..!

కూలి పనులకెళ్తూ..!

కూలి పనులకెళ్తూ..!

కూలి పనులకెళ్తూ..!

కూలి పనులకెళ్తూ..!