
చెట్టును ఢీకొన్న సుమో
– యువకుడికి తీవ్ర గాయాలు
గంగవరం: మండలంలోని కల్లుపల్లి గ్రామ సమీపంలో ఏసీ గోడౌన్ వద్ద గురువారం సుమో చెట్టును ఢీకొనడంతో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. పోలీసుల కథనం మేరకు.. పలమనేరు మండలం కరిడిమడుగు గ్రామానికి చెందిన ప్రవీణ్(22) పట్టణంలో మినరల్ వాటర్‌ను తరలించే వాహనం డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. పలమనేరులోని పూల మార్కెట్ నుంచి పూల హారాలు తీసుకుని స్నేహితుడు మోహన్‌తో కలిసి బోయకొండకు బయలుదేరారు. తిరిగి వస్తుండగా మండలంలోని కల్లుపల్లి సమీపంలోని ఏసీ గోడౌన్ వద్ద సుమో ముందు టైరు పంక్చర్ అయి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొంది. దీంతో ప్రవీణ్ తీవ్రంగా గాయపడ్డాడు. మోహన్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. సుమో ముందుభాగం పూర్తిగా ధ్వంసమైంది. స్థానికులు అతన్ని పలమనేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

చెట్టును ఢీకొన్న సుమో