
ఆదిశక్తి అలంకరణలో వరాలతల్లి
చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో నిర్వహిస్తున్న దసరా మహోత్సవాల్లో భాగంగా రెండవ రోజైన బుధవారం అమ్మవారు ఆదిశక్తి పార్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అనంతరం విశేషాభరణాలతో పార్వతీదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. వేదపండితులు గోవర్ధనశర్మ, తదితర అర్చక బృందం ఉత్సవమూర్తి ఎదుట ఈఓ ఏకాంబరం, ఉభయదారులతో కలిసి హోమ పూజలు చేశారు. కార్యక్రమానికి జిఆర్‌ఎస్‌రమణ ( బోయకొండ), ఎం. వేణుగోపాల్‌రెడ్డి, సుగుణ (తిరుపతి) రామచంద్రయ్య, క్రిష్ణవేణి (సోమల) గురుప్రసాద్, గుణ నేత్ర ( బెంగళూరు) రాఘవేంధ్ర, మమత (చిక్‌బల్లాపురం) చంద్రశేఖర్‌రెడ్డి,దుర్గ ( రామాపురం వైఎస్సార్ కడప) వారు ఉభయదారులుగా వ్యవహరించారు. ఆలయంలో గణపతి పూజ, అభిషేకాలు, అర్చనలు, ఊంజల్‌సేవ, హోమం, చండీ హోమం, పూర్ణాహుతి చేశారు.