
గంజాయిపై ఉక్కుపాదం
పుంగనూరు : గంజాయిపై ఉక్కుపాదం మోపుతామని, పాఠశాలలు, కళాశాలల సమీపంలోని 500 మీటర్ల దూరంలో గల షాపులపై ప్రత్యేక నిఘా పెట్టి తగు చర్యలు చేపడుతామని నూతన ఎస్పీ తుషార్‌డూడి తెలిపారు. బుధవారం ఆయన పట్టణ పోలీస్ స్టేషన్‌ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా స్టేషన్‌లోని క్రైమ్ రికార్డులను పరిశీలించారు. స్టేషన్‌కు వచ్చిన బాధితులతో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించి, వారికి పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గంజాయిని పూర్తి స్థాయిలో నిర్మూలించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులను మంచిగా మాట్లాడి వారి సమస్యలను పరిష్కరించాలన్నారు. ఆయన వెంట పలమనేరు డీఎస్పీ డేగల ప్రభాకర్, సీఐ సుబ్బరాయుడు, ఎస్‌బీ సీఐ సూర్యనారాయణ, ఎస్‌ఐలు హరిప్రసాద్, రమణ పాల్గొన్నారు.
త్వరితగతిన నియామక ప్రక్రియ చేపట్టండి
చిత్తూరు కార్పొరేషన్ : కారుణ్య నియమాకానికి జెడ్పీలో దరఖాస్తు చేసుకున్న దివ్యాంగుడు అరుణ్‌కు త్వరితగతిన నియామక ప్రక్రియను పూర్తి చేయాలని జెడ్పీ చైర్మన్ గోవిందప్ప శ్రీనివాసులు ఆదేశించారు. బుధవారం జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో కారుణ్య నియామక ప్రక్రియ పురోగతిని తెలుసుకునేందుకు నిరీక్షిస్తున్న దివ్యాంగుడు అరుణ్‌ను జెడ్పీ చైర్మన్ పలకరించి సమస్యను అడిగి తెలుసుకున్నారు.దివ్యాంగుడికి అందాల్సిన ఫ్యామిలీ పెన్షన్, ఉద్యోగ ప్రక్రియను ఈ నెల 29 లోపు పూర్తి చేయాలని ఆదేశించారు.