
మాఫియాపై నిఘా
జిల్లాలో జరుగుతున్న మైనింగ్ మాఫియా, వసూళ్ల పర్వంపై కలెక్టర్ ప్రత్యేక దృష్టి సారించారు. సాక్షిలో వరుసగా ప్రచురితమైన కథనాలపై స్పందించారు. అక్రమాల గనుడు కథనంతో లోతు విచారణకు ఆదేశించారు. ఇందుకు ఓ కమిటీని నియమించారు. రెవెన్యూ, పోలీసు, మైనింగ్ శాఖలతో కూడిన కమిటీ నియమించి మైనింగ్ మాఫియాపై నిఘా పెట్టారు. మళ్లీ ఆదివారం ప్రచురితమైన గ్రానైట్ రైట్ రైట్, సోమవారం ప్రచురితమైన మైనింగ్ మాఫియా అక్రమాలు ఆపరయా అనే కథనాలకు కలెక్టర్ స్పందించినట్లు తెలిసింది. మైనింగ్ మాఫియాపై వివరాలు అడిగినట్లు తెలిసి వచ్చింది. త్వరలో దీనిపై కమిటీతో చర్చించినట్లు తెలిసింది. ఇంతలో లోతు విచారణ చేసి నివేదికలు ఇవ్వాలని ఆయన ఆదేశించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి.