చిత్తూరు రూరల్ (కాణిపాకం): జిల్లా పశుసంవర్థ క శాఖ జేడీగా ఉమామహేశ్వరి బుధవారం బాధ్యతలు చేపట్టనున్నారు. తిరుపతి జిల్లాలో డీడీగా పనిచేస్తున్న ఆమెను చిత్తూరు జిల్లాకు బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీచేసింది.
26న సబ్ జూనియర్
సాఫ్ట్‌బాల్ జట్ల ఎంపిక
చిత్తూరు కలెక్టరేట్: ఉమ్మడి చిత్తూరు జిల్లా సబ్ జూనియర్ సాఫ్ట్‌బాల్ జిల్లా స్థాయి జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 26న నిర్వహించనున్నట్లు చిత్తూరు సాఫ్ట్‌బాల్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు చందు వెల్లడించారు. ఈ మేరకు మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చిత్తూరు జిల్లా కేంద్రంలోని పీవీకేఎన్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఈనెల 26న ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అర్హులైన క్రీడాకారులు 2011 తర్వాత జన్మించి ఉండాలన్నారు. ఒరిజినల్ ఆధార్ కార్డు, జనన ధ్రువీకరణ పత్రాలు తీసుకురావాలన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికయ్యే క్రీడాకారులు అక్టోబర్ 4, 5, 6 తేదీల్లో విశాఖపట్టణం జిల్లా, కేడీపేట నర్సీపట్టణంలో నిర్వహించే రాష్ట్ర స్థాయి క్రీడాపోటీల్లో పాల్గొంటారన్నారు. ఇతర వివరాలకు 9581887409, 7013989059 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
ప్రకృతి వ్యవసాయంతో
స్థిరమైన ఆదాయం
చిత్తూరు కలెక్టరేట్ : ప్రకృతి వ్యవసాయంతో స్థిరమైన ఆదాయం పొందవచ్చని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ తెలిపారు. మంగళవారం కలెక్టరేట్‌లో ప్రకృతి వ్యవసాయం అమలుపై సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వ్యవసాయం పై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు రాబోయే తరాలకు నీటిని సంరక్షించడం ప్రకృతి వ్యవసా యం ముఖ్య ఉద్దేశమన్నారు. జిల్లాలో పాడిరైతుల ను అభివృద్ధి చేసి పశుగ్రాసం పెంచేందుకు సహజ, సేంద్రియ వ్యవసాయ విధానాలను అమలు చేయాలన్నారు. డీఆర్‌డీఏ, కృషి విజ్ఞాన కేంద్రాలు, గ్రామ పంచాయతీ, పలు శాఖలు సమన్వయంతో పనిచేసి ప్రకృతి వ్యవసాయ లక్ష్యాలను సాధించాలన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వాసు మాట్లాడుతూ జిల్లాలో 35,211 మంది రైతులు 34,633 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారన్నారు. జిల్లాలోని 260 క్లస్టర్లలో ఎన్‌ఎంఎంఎఫ్ ఆధ్వర్యంలో ప్రకృతి వ్యవసాయం ముందుకు తీసుకెళ్లాలన్నారు. అనంతరం జిల్లాలో ప్రకృతి వ్యవసాయంలో మంచి ఫలితాలు సాధించిన వెంకటసుబ్బరాజు, నరేంద్ర, చందుకుమార్, సుజా త, సుమతి, నాగరాజు, చెంగల్‌రెడ్డి, మహేష్, కవి తను దుశ్శాలువతో సత్కరించారు. రాయలసీమ కో–ఆర్డినేటర్ చంద్రశేఖర్, డీఆర్‌డీఏ పీడీ శ్రీదేవి, ఉద్యానశాఖ డీడీ మధుసూదన్‌రావు, వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ పాల్గొన్నారు.
రూ.480 కోట్లు జమ చేయండి!
చిత్తూరు రూరల్ (కాణిపాకం): ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని మామిడి రైతుల అకౌంట్లో తక్షణం రూ.480 కోట్లు జమ చేయాలని ఉమ్మడి చిత్తూరు జిల్లా మామిడి రైతుల సంక్షేమ సంఘం కార్యవర్గం తీర్మానించింది. మంగళవారం చిత్తూరు ఎస్టీయూ కార్యాలయంలో మామిడి రైతుల సంక్షేమ సంఘం సమావేశం టి.జనార్దన్ అధ్యక్షతన జరిగింది. సంఘ నేతలు మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో పల్ప్ ఫ్యాక్టరీలకు తోతాపురి మామిడి సరఫరా చేసి మూడు నెలలు దాటినా నేటికీ డబ్బులు జమ చేయక పోవడం దుర్మార్గమన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 35 వేల మంది రైతులు 4 లక్షల టన్నుల మామిడి సరఫరా చేసినట్టు వెల్లడించారు. 15 రోజుల్లోగా బిల్లులు చెల్లించాలనే నిబంధన ఉన్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం దారుణమన్నారు. కిలోకు రూ.12 చొప్పున చెల్లించాల్సి ఉందన్నారు. ప్రపంచ మామిడి దినోత్సవం సందర్భంగా చిత్తూరు, పూతలపట్టు ఎమ్మెల్యేలు ఇచ్చిన హామీలు సైతం మరిచారన్నారు. ఈనెల 30లోగా నగదు జమచేయకుంటే అక్టోబర్‌లో ప్రత్యక్ష ఆందోళనకు సంసిద్ధం కావాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. సమావేశంలో ఉపాధ్యక్షులు హేమలత, సీ.మునీశ్వర్‌రెడ్డి, కె.మునిరత్నంనాయుడు ఏ.ఉమాపతి నాయుడు, పీ.భారతి, బీ.మురళి, సహాయ కార్యదర్శులు ఎం.లవకుమార్‌రెడ్డి కే.హరిబాబు, చంద్రమౌళిరెడ్డి, కే.సురేంద్రన్, కోశాధికారి పీఎల్.సంజీవరెడ్డి, బీ.శ్రీనివాస్ పాల్గొన్నారు.
నేడు బాధ్యతలు చేపట్టనున్న జేడీ