
బాబు మోసాలపై పోరాటాలకు సిద్ధం
తేనబండలో బాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీ కార్యక్రమం పాల్గొన్న వైఎస్పార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి
చిత్తూరు కార్పొరేషన్: అబద్ధాలు, దుష్ప్రచారాలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పేదలకు సంక్షేమం, అభివృద్ధిని దూరం చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త విజయానందరెడ్డి విమర్శించారు. మంగళవారం 22వ డివిజన్ తేనబండలో పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లీనారెడ్డి, నాయకులు జగ్గ, మురళీనాయకర్ల ఆధ్వర్యంలో శ్రీబాబు ష్యూరిటీ–మోసం గ్యారెంటీశ్రీ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తేనబండలో పార్టీ కార్యకర్తల పై కూటమి నాయకులు కక్ష గట్టి కేసులు పెట్టారని గుర్తుచేశారు.
నీవా నది చుట్టూ ప్రహరీ గోడ కడుతాం, కొత్తగా లిల్లీబ్రిడ్జి నిర్మిస్తామన్న ప్రజాప్రతినిధి హామీ ఏమైందని ప్రశ్నించారు. ప్రజలు చంద్రబాబుకు వేసిన ఒక్క ఓటు వల్ల డివిజన్ వాసులు అక్షరాలా ఏడాదిలో రూ.కోట్లు నష్టపోయారని తెలిపారు. గతంలో ఏ పథకం ప్రవేశపెట్టినా మహిళల పేరుతోనే అమలు చేశారని గుర్తుచేశారు. అనంతరం నగర పార్టీ అధ్యక్షుడు కేపీ శ్రీధర్, మొదలియార్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జ్ఞానజగదీష్, లీనారెడ్డి, మున్సిపల్ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి హరిణిరెడ్డి మాట్లాడారు. చివరిగా క్యూఆర్‌కోడ్ పోస్టర్లను ఆవిష్కరించారు. కార్యక్రమంలో నాయకులు అంజలిరెడ్డి, ఆను, చాన్‌బాషా, నవాజ్, నౌషద్, నారాయణ, చక్రీ, మురళీ, చామంతి, అభిద్‌బాషా, సాధిక్‌బాషా, అస్లాంబాషా, బావాజాన్, అరుణ్, రాజేష్, కుమా రేష్, జ్యోతి, జాన్ పాల్గొన్నారు.

బాబు మోసాలపై పోరాటాలకు సిద్ధం