
తెలుగు ఉపాధ్యాయుడికి జాతీయ అవార్డు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న తెలుగు ఉపాధ్యాయు డు పాపయ్యకు జాతీ య అవార్డు లభించింది. ప్రభుత్వ పాఠశాల ల అభివృద్ధికి, ఉత్తమ విద్యాబోధనకు హైదరాబాద్‌కు చెందిన శారద ఎడ్యుకేషన్ సొసైటీ ఆయనను జాతీయ అవార్డుకు ఎంపిక చేసింది. వెదురుకుప్పం మండలం, బొమ్మయ్యపల్లికి చెందిన ఆయన జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు అధ్యాపకుడిగా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన ఈనెల 25న హైదరాబాద్‌లోని భాస్కర ఆడిటోరియంలో నేషనల్ టీచర్ ఎక్స్‌లెన్స్ జాతీయ అవార్డును అందుకోనున్నారు. ఆయనకు డీఈవో వరలక్ష్మి, హెచ్‌ఎం హసన్‌బాషా, ఉపాధ్యాయులు అభినందనలు తెలిపారు.
భార్య మందలించిందని!
బంగారుపాళెం: భార్య మందలించడంతో భర్త కనిపించకుండా వెళ్లిపోయాడు. భర్త అదృశ్యంపై మంగళవారం భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. వివరాలు.. మండలంలోని ఎర్రాండ్లపల్లె దళితవాడకు చెందిన శరత్‌బాబు(40) ట్రాక్టర్ డ్రైవర్. తరచూ మద్యం తాగి ఇంటికి వెళ్లేవాడు. ఈ నెల 17న మద్యం సేవించి ఇంటికి వెళ్లడంతో భార్య పుష్ప గొడవపడింది. దాంతో భార్యపై అలిగి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కనిపించలేదు. ఈ మేరకు భార్య పుష్ప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

తెలుగు ఉపాధ్యాయుడికి జాతీయ అవార్డు