
ఓ నారీ..ఆరోగ్యంపై అశ్రద్ధ తగదు
యాదమరి: ప్రస్తుత సాంకేతిక యుగంలో తీరిక లేని సమయాన్ని గడుపుతున్న నారీమణులు తమ ఆరో గ్యంపై అశ్రద్ధ వహించడం అంత క్షేమం కాదని జిల్లా వైద్యాధికారి సుధారాణి అన్నారు.ఆమె స్వస్థ్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం మండల పరిధిలోని మోర్దానపల్లిలో పర్యటించారు. ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం మానవ ఆరోగ్యాన్ని కబళిస్తున్న మధుమేహం, రక్తపోటు, మహమ్మారి వివిధ రకాల క్యాన్సర్లు బయటపడితే అటువంటి వారికి మెరుగైన వైద్యం అందిస్తామని చెప్పారు. ఈనెల 25న యాదమరి పీహెచ్‌సీలో వైద్య నిపునులచే ప్రత్యేక వైద్య శిబిరం నిర్వహించనున్నట్లు మండల వైద్యాధికారి డా.అనిల్‌కుమార్ నాయక్ చెప్పారు. ఈ కార్యక్రమంలో సీహెచ్‌ఓ శ్రీనివాసమూ ర్తి, సూపర్‌వైజర్‌లు లక్ష్మీపతి, సెలవరాణి, వైద్య సహా యకులు సురేంద్రనాథరెడ్డి, సర్పంచ్ వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.