
గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వద్దు
చిత్తూరు కలెక్టరేట్ : గృహ నిర్మాణాల పురోగతిలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్‌లో హౌసింగ్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గృహ నిర్మాణాల వేగవంతంలో హౌసింగ్ ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లు కీలకపాత్ర పోషించాలన్నారు. వివిధ దశల్లో ఉన్న గృహ నిర్మాణాలను త్వరతిగతిన పూర్తిచేసేలా చర్యలు చేపట్టాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో వెనుకబడితే చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించారు. హౌసింగ్ పీడీ సుబ్రహ్మణ్యం, ఈఈ శంకరప్ప, ఏఈలు, ఇంజినీరింగ్ అసిస్టెంట్‌లు పాల్గొన్నారు.