
బంగారుపాళెంలో భారీ వర్షం
మొగిలి వద్ద ఎన్స్‌ప్రెస్ హైవే టెంట్లల్లోకి చేరిన నీరు
బంగారుపాళెం: నిండుకుండలా గుంతూరు చెరువు
మొరవపోతున్న అనబండచెరువు
బంగారుపాళెం: మండలంలో సోమవారం రాత్రి భారీ వర్షం కురిసింది. అటవీ ప్రాంతంలోని వాగు లు, వంకలు, చెక్‌డ్యాంలు సాగి చెరువులకు భారీగా నీరు చేరుతోంది. మండలంలోని మొగిలి గ్రామంలోని గౌనిచెరువు, అనబండచెరువులు నిండి మొరవలు సాగుతున్నాయి. జంబువారిపల్లె, గుంతూరులోని వెంకటప్పనాయుని చెరువు, వీరప్పనాయుని చెరువులు నిండుకుండలా మారాయి. బలిజపల్లెలోని కామాక్షమ్మ చెరువుకు నీరు చేరుతున్నాయి. చీకలచెరువుకు నీరు చేరుతోంది. పాలేరులోని చిల్లామల చెరువుకు వంకలద్వారా నీరు చేరడంతో జలకళ సంతరించుకుంది. పాలేరు సమీపంలోని గజాగుండం జలపాతం వర్షపు నీటితో పరవళ్లు తొక్కుతోంది. బండరాయి మీదుగా జోరుగా నీరు ప్రవహిస్తోంది. మండలంలోని మొగిలి గ్రామ సమీపంలో అనబండచెరువు మొరవ పోవడంతో నీరు ఎక్స్‌ప్రెస్ హైవే పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకోవడంతో కూలీలు బసఉండే టెంట్లు నడుములోతు నిండాయి. రైతుల పంటపొలాలపైకి నీరు వచ్చిందని రైతులు అంటున్నారు. వేరుశెనగ పంటకు వర్షం ప్రతికూలంగా మారిందని రైతులు చెబుతున్నారు. తేమకు పంట దిగుబడి దెబ్బతినే అవకాశం ఉందని అంటున్నారు.

బంగారుపాళెంలో భారీ వర్షం

బంగారుపాళెంలో భారీ వర్షం