
స్వస్థ్ నారీని పకడ్బందీగా నిర్వహించాలి
చిత్తూరు రూరల్ (కాణిపాకం): స్వస్థ్ నారీని పకడ్బందీగా నిర్వర్తించాలని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ఆదేశించారు. సాక్షి దినపత్రికలో ఈనెల 19వ తేదీన స్వస్థ్ నారీ వెతలు పేరుతో వార్త వెలువడింది. దీనిపై స్పందించిన డీఎంఅండ్‌హెచ్‌ఓ సోమవారం వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కార్యక్రమ అమలు తీరుపై చర్చించారు. పీహెచ్‌సీలోని డాక్టర్లు, సిబ్బంది స్థానికంగానే ఉండాలన్నారు. స్వస్థ్ నారీ కార్యక్రమాన్ని విధిగా నిర్వహించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ లక్ష్యం మేరకు జరిపించాలన్నారు. 18 ఏళ్లు పైబడి, అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారికి కచ్చితంగా స్క్రీనింగ్ పరీక్షలు చేయించాలన్నారు. ప్రతి ఒక్కరికీ ఆబా ఐడీ నమోదు చేయాలన్నారు. బాలింతలకు రక్తహీనత పరీక్షలు చేసి ఐరన్ మాత్రలు ఇవ్వాలన్నారు. అనుమానిత క్యాన్సర్ కేసులను గుర్తించాలన్నారు. అలాగే టీబీ పరీక్షలు చేసి నిర్ధారణ అయినా కేసులకు మెరుగైన వైద్య సేవలందించాలన్నారు. మాతా శిశు సంరక్షణ సేవలను శనివారానికి వంద శాతం పూర్తిచేయాలని ఆదేశించారు. డాక్టర్లు ప్రతిరోజూ జరిగే స్వస్థ్ నారీ కార్యక్రమాన్ని పర్యవేక్షించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ వెంకట ప్రసాద్, హనుమంతరావు, ప్రవీణ, అనూష, నవీన్‌తేజ్ రాయ్, అర్పిత తదితరులు పాల్గొన్నారు,

స్వస్థ్ నారీని పకడ్బందీగా నిర్వహించాలి