
అక్రమ కేసులు కక్ష సాధింపే
అధికారం చేపట్టిన నాటి నుంచే కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమాలు, దాడులు ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించే పత్రికల గొంతు నొక్కి అక్రమ కేసులు బనాయించడం కక్ష సాధింపే. ప్రభుత్వం చేస్తున్న అరచాకాలను వెలుగులోకి తెచ్చేలా వార్తలు రాస్తే వారిపై కక్ష సాధింపు చర్యగా పత్రికా స్వేచ్ఛకు భంగం కలిగించేలా వ్యవస్థలను చేతుల్లోకి తీసుకునేలా వ్యవహరించడం, సాక్షి దినపత్రిక ఎడిటర్‌తోపాటు విలేకర్లపై అక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేయడమే.
– జీ శశికుమార్, గూడూరు నియోజకవర్గ కార్యదర్శి, సీపీఐ