
డిప్యుటేషన్‌పై వైద్య సిబ్బంది
పెనుమూరు(కార్వేటినగరం): సక్రమంగా విధులు నిర్వర్తించని పెనుమూరు సీహెచ్‌సీ వైద్యసిబ్బందిని కుప్పం ఏరియా ఆస్పత్రికి డిప్యుటేషన్‌పై బదిలీ చేసినట్లు సమాచారం. ఈ నెల 18వ తేదీ పెనుమూరు కమ్యూనిటీ హెల్త్‌సెంటర్‌ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బంది సేవలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అధికారులు డీసీహెచ్‌ఎస్ పద్మాంజలి, డాక్టర్ గీతాకుమారిని కలెక్టర్‌కు సరెండర్ చేశారు. రేడియోగ్రాఫర్ గీతాకుమారిని డిప్యూటేషన్‌పై కుప్పం ఏరియా ఆస్పత్రికి బదిలీ చేసినట్లు తెలిసింది.
టీబీని తరిమికొట్టాలి
చిత్తూరు కలెక్టరేట్ : టీబీ వ్యాధిని తమిరికొట్టాలని కలెక్టర్ సుమిత్‌కుమార్‌గాంధీ పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం కలెక్టర్ చేతుల మీదుగా 100 మంది క్షయ వ్యాధి గ్రస్తులకు ఆహార పదార్థాలను పంపిణీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ క్షయా వ్యాధి పట్ల క్షేత్ర స్థాయిలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. మారుతున్న జీవన విధానం, తగ్గుతున్న వ్యాధి నిరోధకశక్తి కారణంగా కొన్నేళ్లుగా పిల్లలు సైతం క్షయ వ్యాధి బారిన పడుతున్నారన్నారు. అప్రమత్తతతో పాటు క్రమం తప్పకండా మందులు వాడితే క్షయ నివారణ సాధ్యమేనన్నారు. క్షయ నిర్మూలనకు నిక్షయ్ సంపర్క్ హెల్ప్‌లైన్ 1800–11–6666 టోల్ ఫ్రీ నెంబర్‌లలో సంప్రదించాలన్నారు. జేసీ విద్యాధరి, డీఎంఅండ్‌హెచ్‌వో సుధారాణి, అడిషనల్ డీఎంఅండ్‌హెచ్‌వో వెంకటప్రసాద్ పాల్గొన్నారు.
అర్జీలు పరిష్కరించాలి
చిత్తూరు కలెక్టరేట్ : పీజీఆర్‌ఎస్‌లో ప్రజలు అందజేసే అర్జీలను సంతృప్తి స్థాయిలో పరిష్కరించాలని కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో పలు శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నమోదయ్యే ప్రతి అర్జీని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలన్నారు. అర్జీల పరిష్కారంలో ఎలాంటి అలసత్వం వహించకూడదన్నారు. అర్జీలు రీ ఓపెన్ అయితే శాఖాపరంగా చర్యలుంటాయని హెచ్చరించారు. పీజీఆర్‌ఎస్‌లో ప్రతి వారం 200 నుంచి 300 అర్జీలు నమోదవుతున్నాయని, అధిక శాతం అర్జీలు నమోదవుతున్న శాఖల అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు. జిల్లాలో గత ఏడాది జూన్ 15 నుంచి ఇప్పటి వరకు 63,063 అర్జీలు నమోదైనట్లు వెల్లడించారు. జిల్లాలోని అన్ని శాఖల్లో కచ్చితంగా ఈ ఆఫీస్ అమలు చేయాలన్నారు. మాన్యువల్ విధానంలో ఫైల్స్ పంపకూడదన్నారు. ప్రతి కార్యాలయంలో ఉద్యోగులు ఎన్ని ఫైల్స్ పరిష్కరించారు, ఎన్ని పెండింగ్‌లో ఉన్నాయనే వివరాలను నివేదికల రూపంలో సిద్ధంగా పెట్టుకోవాలన్నారు. జిల్లాలోని మామిడి రైతులకు త్వరలో రూ.157 కోట్లు సబ్సిడీ అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ సమీక్షలో జాయింట్ కలెక్టర్ విద్యాధరి, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.
24న తిరుపతికి చేరుకోవాలి
చిత్తూరు కలెక్టరేట్ : ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 24న తిరుపతిలోని చదలవాడ ఇంజినీరింగ్ కళాశాలకు చేరుకోవాలని డీఈవో వరలక్ష్మి తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమె విలేకరులతో మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో డీఎస్సీలో ఎంపికై కాల్ లెటర్లు అందుకున్న అభ్యర్థులు ఈ నెల 24న తిరుపతిలోని చదలవాడ ఇంజినీరింగ్ కళాశాలకు ఉదయం 7 గంటలకు చేరుకోవాలన్నారు. అభ్యర్థులు తమ సౌకర్యార్థం బ్లాంకెట్స్, తలదిండు, గొడు గులు తీసుకొచ్చుకోవాలన్నారు. చేరుకునే అభ్యర్థులను రిపోర్టు చేసుకున్న జాబితా ప్రకారం ఈ నెల 25న విజయవాడలో జరిగే కార్యక్రమానికి ఐడీ కార్డులు అందజేస్తామన్నారు. అభ్యర్థులు తమ ఫొటోతో పాటు విచ్చే సే అభ్యర్థుల పాస్‌పోర్ట్ సైజ్ ఫొటో, ఐడీ కార్డు ను తీసుకురావాలన్నారు. తిరుపతి నుంచి ప్రత్యేక బస్సుల్లో అభ్యర్థులను విజయవాడకు తరలిస్తామని ఆమె వెల్లడించారు.

డిప్యుటేషన్‌పై వైద్య సిబ్బంది