
వైఎస్సార్‌సీపీలో కార్యకర్తలే కీలకం
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు: వైఎస్సార్‌సీపీని గ్రామ స్థాయి నుంచి పటిష్టం చేస్తూ కార్యకర్తలే కీలకంగా కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్లు మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సోమవారం పుంగనూరు నియోజకవర్గంలోని మున్సిపాలిటీతో సహా అన్ని మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పార్టీ అనుబంధ సంఘాల నాయకులతో కలసి తిరుపతిలో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరులో వినూత్న పద్ధతిలో వార్డులు, గ్రామాల వారీగా ఇన్‌చార్జ్‌లను, కార్యకర్తలను ఎంపిక చేశారు. వారితో సెల్‌ఫోన్ల ద్వారా పెద్దిరెడ్డి నేరుగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కార్యక్రమ కమిటీల ఏర్పాటు డేటాను మండలాల వారీగా స్వీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం నియంత పోకడలను, అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లి చైతన్యపరచాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉందన్నారు. వైఎస్.జగన్‌మోహన్‌రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ కష్టపడాలన్నారు. పుంగనూరు నియోజకవర్గంలో చేపట్టిన ఈ వినూత్న కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరితోనూ నేరుగా సంభాషిస్తూ, వారి కష్టసుఖాలను తెలుసు కుని అండగా ఉంటానని భరోసానిచ్చారు. ఎలాంటి ఒత్తిళ్లకు, బెదిరింపులకు తలొగ్గాల్సిన పనిలేదని ఆయన స్పష్టం చేశారు. కార్యకర్తలకు ఏకష్టం వచ్చినా పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ వజ్ర భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి అనీషారెడ్డితో పాటు పార్టీ మహిళా నాయకురాళ్లు పాల్గొన్నారు.