
కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగులు
చిత్తూరు కార్పొరేషన్: తమ సమస్యలను పరిష్కారించాలంటూ విద్యుత్ ఉద్యోగులు కదంతొక్కారు. సోమవారం జిల్లా కేంద్రంలోని అమూల్ డెయిరీ వద్దకు వందలాది మంది ఉద్యోగులు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా తమ డిమాండ్ల సాధన కోసం నినాదాలు చేసుకుంటూ కదిలారు. అనంతరం కలెక్టరేట్ వద్దకు చేరుకొని ఆందోళన వ్యక్తం చేశారు. తర్వాత కలెక్టర్ సుమిత్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. జిల్లా జేఏసీ నాయకులు మురళీకృష్ణ, వివేకానందరెడ్డి, యజ్ఞేశ్వరరావు మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు ఆస్పత్రిలో వైద్యఖర్చులకు రూ.లక్షలు ఖర్చువుతోందన్నారు. కానీ మెడికల్ బిల్లులు 60 శాతం కూడా కవర్ కావడం లేదన్నారు. మొత్తం వైద్యఖర్చులు చెల్లించే విధంగా చూడాలన్నారు. పెండింగ్‌లో ఉండే నాలుగు డీఏ బకాయిలను విడుదల చేయాలని, 1999–2004 మధ్య ఉద్యోగంలో చేరినవారికి ఈపీఎఫ్ పింఛన్ విధానం అమలు చేయాలన్నారు. జేఎల్‌ఎం గ్రేడ్–2 ఉద్యోగులను విద్యుత్‌శాఖలో విలీనం చేసి, జీతాలు పెంచాలన్నారు. డిప్లొమా చేసిన ఓఅండ్‌ఎం ఉద్యోగులకు పదోన్నతిలో అవకాశం కల్పించాలన్నారు. లైన్‌మెన్లకు లైన్‌ఇన్స్‌స్పెక్టర్ట్‌గా, సబ్‌ఇంజినీర్లను ఏఈగా, ఏఈలకు డీఈ, ఈఈలుగా అవకాశం కల్పించాలన్నారు. నాయకులు బద్రి, బాబు, బాలాజీ, జాఫర్, రమణ, హేమచంద్ర, వరదరాజులు, గోవిందు, అక్బర్, నాగయ్య, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
యాదమరి ఆదర్శంగా నిలవాలి
యాదమరి: మన డబ్బులు మన లెక్కలు కార్యక్రమంలో భాగంగా యాదమరి చిత్తూరు జిల్లాలోనే ఆదర్శంగా నిలవాలని డీఆర్డీఏ పీడీ శ్రీదేవి సూచించారు. సోమవారం ఆమె ఎండీఎంఎల్ కార్యక్రమంలో భాగంగా మండలంలోని అతిగారిపల్లి, పెరియంబాడి గ్రామాల్లోని సంఘ సభ్యులకు అవగాహన కల్పించారు. ఆమె మాట్లాడుతూ సంఘ చెల్లింపులు పారదర్శకత కోసమే ఈ కార్యక్రమం చేపడుతున్నట్టు వెల్లడించారు. అందులో భాగంగానే మండలంలోని పెరియంబాడి, అతిగారిపల్లి, 14కండ్రిగ, మోర్దానపల్లి, తెల్లరాళ్లపల్లి–2ఏ గ్రామ సమైఖ్య సంఘాలలో అమలు చేస్తున్నామన్నారు. ప్రతి పది సంఘాలకు ఒక ఈ–నారీని గుర్తించి వారి ద్వారా సంఘం యొక్క లావాదేవీలు తెలుసుకోవచ్చన్నారు.

కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగులు

కదం తొక్కిన విద్యుత్ ఉద్యోగులు