– IIలో
పులిచెర్ల మండలంలో ఏనుగుల దాడులు ఆగ నంటున్నాయి. నిత్యం ఏదో ఒక గ్రామంలో పంటలను ధ్వంసం చే స్తూనే ఉన్నాయి.
ఆలకిస్తూ..భరోసానిస్తూ!
చిత్తూరు అర్బన్: సుదూర ప్రాంతాల నుంచి న్యాయం కోసం వచ్చిన ప్రజల సమస్యలను ఓపికగా విన్నారు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలి..? విచారణ నేపథ్యంపై ఆయా స్టేషన్ హౌజ్ ఆఫీసర్లతో (ఎస్‌హెచ్‌వో) మాట్లాడి, ప్రజలకు భరోసా ఇచ్చారు. చిత్తూరు నగరంలోని ఏఆర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్‌ఎస్ కార్యక్రమానికి తొలిసారి హాజరైన ఎస్పీ తుషార్ డూడీ.. ప్రజల నుంచి వినతులు తీసుకున్నారు. వీటిలో కుటుంబ తగాదాలు, వేధింపులు, మోసాలు, ఇంటి తగాదాలు, భూ తగాదాలు, లావాదేవీలకు సంబంధించిన సమస్యలున్నాయి. తన వద్ద కు వచ్చిన బాధితులతో ఆయన ఓపిగా మాట్లాడి, న్యా యం చేస్తామన్నారు. ఫిర్యాదులను ఆన్‌లైన్ చేయడంతో పాటు నిర్ణీత గడువులోపు సమస్యలు పరిష్కారమయ్యేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పలు ఫిర్యాదులపై అప్పటికప్పుడే ఎస్‌హెచ్‌వోలత మాట్లాడారు. ప్రజల నుంచి వచ్చే ప్రతి ఒక్క సమస్యపై విచారణ చేపట్టి, ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. మొత్తం 53 ఫిర్యాదులు అందాయి. అలాగే చిత్తూరు ఏఎస్పీ రాజశేఖర రాజు సైతం ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు.
మహిళా సంరక్షణ కార్యదర్శిపై వేటు
పెనుమూరు(కార్వేటినగరం): మండల పరిధిలోని సీఆర్ కండ్రిగ గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న మహిళా సంరక్షణ కార్యదర్శి శకుంతలను కలెక్టర్ సుమిత్ కుమార్ సస్పెండ్ చేశారు. ఈ మేరకు సోమవారం సస్పెండ్ ఆర్డర్లు జారీ చేశారు. వివరాలు.. సీఆర్ కండ్రిగ గ్రామ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న శంకుతల రిజిస్టర్‌లో సంతకం చేయక పోవడంతో పాటు బయోమెట్రిక్ హాజరు కూడా నమోదు కాలేదు. విధులకు ఆలస్యంగా హాజరు కావడంపై కారణం అడగ్గా సక్రమంగా సమాధానం చెప్పక పోవడంతో ఎంపీడీవో నీలకంటేశ్వర్‌రెడ్డి ఇచ్చిన నివేదిక ప్రకారం ఆమెను విధుల నించి తొలగించినట్టు కలెక్టరేట్ అధికారులు పేర్కొన్నారు.