
రెవెన్యూ సమస్యలు పరిష్కరించాలి
జిల్లాలో రెవెన్యూ సమస్యలను పరిష్కరించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి వాడ గంగరాజు కోరారు. ఆయన మాట్లాడుతూ బంగారుపాళ్యం మండలంలో దారి, కాలువ సమస్య పరిష్కారించాలని ఆన్‌లైన్‌లో ఫిర్యాదు చేస్తే పరిష్కరించకుండానే పరిష్కారం అయిపోయినట్లు అధికారులు చెప్పడం దారుణమన్నారు. అలాగే అనేక మండలాల్లో ఇదే దుస్థితి ఉందన్నారు. రాత్రికి, రాత్రే భూములు ఆక్రమించేస్తున్నారని ఆరోపించారు. గంగవరం మండలంలో మునెమ్మ అనే మహిళ రెవెన్యూ అధికారుల అలసత్వానికి యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి యత్నించడం బాధాకరమన్నారు.