
రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి
కూటమి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు పట్నం సురేంద్రరెడ్డి కోరారు. ఈ మేరకు ఆ సంఘం నాయకులు సోమ వారం కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది రెడ్డి కులస్థులు ఉండగా అందులో 80 శాతం మంది పేదలున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసి పాలకమండలిని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేయకుండా నిర్లక్ష్యం వహించడం దారుణమన్నారు. సంఘం సభ్యులు దామోదరరెడ్డి, దేవరాజులురెడ్డి, ధనంజయులురెడ్డి, లోకనాథరెడ్డి పాల్గొన్నారు.