
పేదల భూములపై పచ్చ పంజా
మహానేత వైఎస్సార్ పేదలకు ఇచ్చిన భూములపై టీడీపీ నేతల కన్ను విజయపురం మండలం జగన్నాథపురంలో వెలుగు చూస్తున్న మరో అక్రమం పేదలకు ఇచ్చిన భూముల్లో చదును చేస్తున్న వైనం ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరిస్తున్న నేతలు తమ భూముల జోలికి వస్తే పోరాటాలకు సిద్ధమంటున్న హక్కుదారులు
సాక్షి టాస్క్‌ఫోర్స్: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజయపురం మండలం జగన్నాథపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. ఏడాదికాలంగా గ్రావెల్ అక్రమ రవాణాతో రెచ్చిపోయిన నాయకులు ఇప్పుడు భూకబ్జాకు పథక రచన చేస్తున్నారు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందంగా అధికారం ఉండగానే కాసులు వెనుకోవాలనే యోచనతో ఎడాపెడా ప్రకృతి సంపదను కాజేస్తూ.. ప్రభుత్వ భూములను, పేదలకు ఇచ్చిన భూములను ఆక్రమించేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నేటి వరకు గ్రావెల్ అక్రమ రవాణా, భూకబ్జాలకు పాల్పడుతున్నారు. తాజాగా గతంలో భూమి లేని నిరుపేదలకు అందజేసిన అసైన్డు భూమిని విజయపురం టీడీపీ నేతలు తమ అనుచరులకు కట్టబెట్టేందుకు సిద్ధమయ్యారు.
భూమిలేని పేదలకు పంచిన మహానేత
విజయపురం మండలం జగన్నాథపురం రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 206, 207లో 200 ఎకరాల భూమిని 2006లో అప్పటి సీఎం మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి పన్నూరుకు చెందిన సుమారు 200 మంది ఎస్సీ, ఎస్టీలకు ఎకరా చొప్పున 200 ఎకరాలను పంపిణీ చేసి పట్టాలు ఇచ్చారు. అయితే ఇప్పుడు ఆ భూములను ఆక్రమించుకోవడానికి కూటమి నేత లు సిద్ధమయ్యారు. గత వారం రోజులుగా ఆ భూమి ని కబ్జా చేసేందుకు తెరచాటు రాజకీయాలు చేస్తున్నా రు. ఇప్పటికే ముళ్ల చెట్లు తొలగించడం, భూమిని చదును చేయడం వంటి కార్యక్రమాల ను చేపట్టారు. తమకు పట్టాలు ఇచ్చిన భూమిలో మీరెందుకు చదు ను చేస్తున్నారని ప్రశ్నిస్తే.. దిక్కున్న చోట చెప్పుకోండని బెదిరింపులకు దిగుతున్నారని హక్కుదారులు వాపోతున్నారు. దీనిపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. తమ భూముల జోలికి వస్తే పెద్దఎత్తున పోరాటాలకు దిగుతామని హెచ్చరిస్తున్నారు.
జగన్నాథపురంలో కూటమి నాయకులు ఆక్రమించుకోవాలనుకుంటున్న భూమి
దివంగతనేత వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఇచ్చిన పట్టాదారు పాస్‌బుక్

పేదల భూములపై పచ్చ పంజా