
నేడు పోలీసు కార్యాలయంలో గ్రీవెన్స్‌డే
చిత్తూరు అర్బన్: చిత్తూరు నగరంలోని వన్‌టౌన్ పక్కన ఉన్న ఆర్ముడు రిజర్వు (ఏఆర్) కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (గ్రీవెన్స్‌డే) కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఎస్పీ తుషార్ డూడీ ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజలు వారి సమస్యలు ఏవై నా ఉంటే తనను నేరుగా కలిసి మాట్లాడొచ్చన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి ఇక్కడ ఇచ్చే వినతులు, ఫిర్యాదులను పరిశీలించి చర్యలు చేపడుతామని ఎస్పీ తెలిపారు.
నేడు కలెక్టరేట్‌లో
ప్రజాసమస్యల పరిష్కార వేదిక
చిత్తూరు కలెక్టరేట్ : ప్రజల సమస్యల పరిష్కా రం కోసం సోమవారం కలెక్టరేట్‌లో ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు కలెక్టర్ సుమిత్ కుమార్‌గాంధీ వెల్లడించారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మా ట్లాడారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పక హాజరుకావాలన్నారు.
మానవత్వం
చాటుకున్న పోలీసులు
నగరి: మతిస్థిమితం లేని మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళను ఆమె తల్లిదండ్రులకు అప్పగించి నగరి పోలీసులు మానవత్వం చాటుకున్నారు. ఈ నెల 16వ తేదీన నగరి పట్టణంలో సుమారు 30 ఏళ్ల వయసు గల ఒక మహిళ రోడ్డుపై తిరుగుతూ, అందరితో గొడవపడుతూ, నివాస ప్రాంతాల వద్దకు వెళ్లి సమస్యలు సృష్టించడం పోలీసుల దృష్టికి వచ్చింది. సీఐ విక్రమ్ మతిస్థిమితం లేని మహిళ ఎక్కడి నుంచో తప్పిపోయి వచ్చినట్లు గుర్తించి డీఎస్పీ సయ్యద్ మహమ్మద్ అజీజ్‌కు తెలియజేశారు. ఆయన ఆదేశాల మేరకు ఎస్‌ఐ విజయనాయక్, మహిళా కానిస్టేబుల్ భార్గవి మతిస్థిమితం లేని మహిళ వివరాలు సేకరించారు. ఆమె పేరు ప్రస్తుథీషేన్ (31) అని, ఆమె భర్త పేరు రమేష్ అని వారి నివాస ప్రాంతం మధ్యప్రదేశ్ పఠాన్ జిల్లా, జబల్పూర్ అని కనుగొన్నారు. పోలీసు శాఖ ద్వారా ఆమె కుటుంబ సభ్యులకు వివరాలు అందించారు. మహిళను చిత్తూరు వన్ స్టాప్ సెంటర్‌కి తరలించి, సిబ్బంది సహకారంతో 5 రోజులపాటు అవసరమైన చికి త్స అందించారు. మతిస్థిమితం లేని మహిళను ఆమె తల్లిదండ్రులకు సురక్షితంగా అప్పగించారు. మతిస్థిమితం లేని మహిళను తల్లిదండ్రుల చెంతకు చేర్చిన నగరి పోలీసులను జిల్లా ఎస్పీ తుషార్ డూడి అభినందించారు.