
బడబళ్లవంక ప్రాజెక్టు తూముకు గండి
– IIలో
రొంపిచెర్ల– పులిచెర్ల మండలాల మధ్య ఉన్న బడబళ్లవంక ప్రాజెక్టుకు గండి పడడంతో పంటలు నీట మునిగి నష్టం వాటిల్లింది.
పలమనేరు: పేదరికంలో ఉన్న ఒక మహిళ తన భర్తకు అంత్యక్రియలు చేయలేని దుస్థితిలో ఉండగా పలమనేరు హెల్పింగ్ హ్యాండ్స్ నిర్వాహకులు ఆదుకున్నారు. ఆ వ్యక్తికి అంతిమ సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్నారు. స్థానిక కప్పలవీరాస్వామి వీధిలో కాపురం ఉంటున్న వ్యక్తి అనారోగ్యంతో మృతి చెందాడు. అతనికి అంతిమ సంస్కారాలు చేయడానికి ఆర్థిక స్తోమత లేక భార్య వీరిని ఆశ్రయించగా సంప్రదాయబద్ధంగా అంతిమ సంస్కారాలు చేశారు.
మాన్యువల్‌గా కౌన్సెలింగ్ నిర్వహించండి
చిత్తూరు కలెక్టరేట్ : డీఎస్సీ అభ్యర్థులకు మాన్యువల్ కౌన్సెలింగ్ నిర్వహించాలని ఆపస్ రాష్ట్ర అధ్యక్షుడు బాలాజీ కోరారు. ఈ మేరకు ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. చాలా ఏళ్లుగా అభ్యర్థులు కష్టపడి చదివి డీఎస్సీ పరీక్షలో తమ ప్రతిభను చాటారన్నారు. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులకు వారి తల్లిదండ్రుల సమక్షంలో మ్యాన్యువల్ కౌన్సెలింగ్‌లో ప్రత్యక్షంగా ఖాళీలను ఎంపిక చేసుకునే అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. తద్వారా అభ్యర్థులు సంతోషంగా విధులలో చేరే అవకాశం ఉంటుందన్నారు. తప్పనిసరిగా మ్యాన్యువల్ కౌన్సెలింగ్ అమలు చేసి తీరాలని ఆయన డిమాండ్ చేశారు.
శ్రీవారి దర్శనానికి 8 గంటలు
తిరుమల: తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. క్యూకాంప్లెక్స్‌లో 10 కంపార్ట్‌మెంట్లు నిండాయి. శనివారం అర్ధరాత్రి వరకు 82,042 మంది స్వామివారిని దర్శించుకోగా 23,393 మంది భక్తు లు తలనీలాలు సమర్పించారు. స్వామివారికి కానుకల రూపంలో హుండీలో రూ.4.59 కోట్లు సమర్పించారు. టైంస్లాట్ టిక్కెట్లు కలిగిన భక్తులకు సకాలంలోనే దర్శనం అవుతుండగా, టిక్కెట్లు లేని వా రికి 8 గంటల్లో లభిస్తోంది. ప్రత్యేక ప్రవేశ దర్శన టి క్కెట్లు ఉన్నవారికి 3 గంటల్లో దర్శనం లభిస్తోంది.