
పూర్తి స్థాయిలో నిండిన వైఎస్సార్ జలాశయం
పలమనేరు: మండలంలోని కాలువపల్లి వద్దనున్న వైఎస్సార్ జలాశయం వరద నీటితో పూర్తిస్థాయిలో నిండింది. మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి, సిబ్బందితో కలిసి ఆదివారం ప్రాజెక్టు వద్దకు చేరుకున్నారు. గంగమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ ప్రాజెక్టు నిండినందున పట్టణవాసులకు తాగునీటికి సమస్య ఉండదన్నారు. ప్రాజెక్టు వద్ద ఫిల్టర్ బెడ్లు, మోటార్ల మరమ్మతులు చేపట్టనున్నట్టు తెలిపారు.
మొరవ పారుతున్న వెంకటపతయ్య చెరువు
బైరెడ్డిపల్లె: వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు మండలంలోని తీర్థం సమీపంలో ఉన్న వెంకటపతయ్య చెరువు నిండి పొంగి మొరవపోతోంది. దీంతో గ్రామస్తులు ఆదివారం గంగమ్మకు పూజలు చేశారు. చెరువు నిండడంతో సాగునీటికి ఇబ్బంది ఉండదని ఆయకట్టు రైతులు ఆనందం వ్యక్తం చేశారు.

పూర్తి స్థాయిలో నిండిన వైఎస్సార్ జలాశయం