
ఇండస్ట్రియల్ విజిట్‌కు
– IIలో
ఇండస్ట్రియల్ విజిట్‌కు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఇంజినీరింగ్ విద్యార్థులు వెళ్లారు.
ఎన్‌ఎంఎంఎస్
రెన్యూవల్‌కు అవకాశం
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లాలో 2024 డిసెంబర్ 8న నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షలో ఎంపికై న విద్యార్థులు రెన్యూవల్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అధికారులు శనివారం డీఈవో కార్యాలయానికి ఉత్తర్వులు పంపారు. ఆ ఉత్తర్వుల మేరకు 2021, 2022, 2023 సంవత్సరాల్లో ఎంపికై గత సంవత్సరం నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో అప్లికేషన్ నమోదు చేసుకున్న విద్యార్థులకు మరొక అవకాశం కల్పించారు. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో ఈ నెల 30వ తేదీలోపు రెన్యువల్ చేసుకునేలా వెసులుబాటు కల్పించినట్లు పేర్కొన్నారు. ఈ సంవత్సరంలో 10, 11, 12 తరగతుల ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాలయాల్లో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు తప్పకుండా రెన్యువల్ చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి విద్యార్థి తన బ్యాంక్ ఖాతా, తన ఆధార్ నెంబర్‌కు సీడ్ చేయించుకుని డీబీటీ రూపంలో నగదు జమ అయ్యేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఇతర వివరాలకు డీఈవో కార్యాలయంలోని పరీక్షల విభాగంలో సంప్రదించాలని పేర్కొన్నారు.
విద్యుత్ అంతరాయాలు తగ్గించండి
చిత్తూరు కార్పొరేషన్: విద్యుత్ అంతరాయాలను తగ్గించాలని ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ ఆదేశించారు. శనివారం విజయవాడ నుంచి ఎస్‌ఈ, ఈఈలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ కార్యాలయం నుంచి ఎస్‌ఈ ఇస్మాయిల్ అహ్మద్, ఈఈలు సమావేశానికి హాజరయ్యారు. ప్రజల్లో విద్యుత్‌శాఖ పై సానుకూలత పెంపొందించే విధంగా పనిచేయాలన్నారు. జిల్లాలో 60 శాతం వినియోగదారుల సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారని ఎస్‌ఈ తెలిపారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల వల ఎక్కువగా అంతరాయాలు లేవన్నారు. గాలి వచ్చినప్పుడు మాత్రమే అంతరాయం వస్తోందన్నారు. పీఎం సూర్యఘర్ పథకం వినియోగం పై మరింత అవగాహన కల్పిస్తామన్నారు.