
ప్రచార వాహనం ప్రారంభం
చిత్తూరు రూరల్ (కాణిపాకం): చిత్తూరు నగరంలోని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఎయిడ్స్‌పై అవగాహన కల్పించే ప్రచార వాహనాన్ని డీఎంఅండ్‌హెచ్‌ఓ సుధారాణి ప్రారంభించారు. ఈ వాహనం 15 రోజుల పాటు జిల్లాలో పర్యటిస్తుందన్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పలు హైరిస్క్ కేసులు, జన సమూహ ప్రాంతాల్లో వీడియో ద్వారా ఎయిడ్స్‌పై అవగాహన కల్పించడం జరుగుతుందన్నారు. ఎయిడ్స్ నోడల్ అధికారి వెంకటప్రసాద్, అధికారులు హనుమంతరావు, ప్రవీణ, అనిల్‌కుమార్, అనూష, నవీన్‌తేజ్, వేణుగోపాల్, జార్జి, జయరాముడు, శ్రీవాణి పాల్గొన్నారు.