
పరిశుభ్రతకు ప్రాధాన్యం
శ్రీరంగరాజపురం : గ్రామీణులు పరిశుభ్రతకు అధిక ప్రాధ్యాన్యమివ్వాలని జెడ్పీ సీఈఓ వి.రవికుమార్ అన్నారు. శనివారం మండలంలోని జీ.ఎం.ఆర్.పురం, శ్రీరంగరాజపురం పంచాయతీల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర.. స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా విచ్చేసి ప్రసంగించారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన పథకం కింద పాతపాళ్యం దళితవాడకు రోడ్డు, డ్రైనేజీ నిర్మాణానికి రూ.20 లక్షలు మంజూరైనట్టు తెలిపారు. కొండపాళ్యం ఎస్టీ కాలనీలో మౌలిక వసతులకు నివేదక తయారు చేయాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జీ.ఎం.ఆర్.పురం, కొండపాళ్యం ఎస్టీ కాలనీకి నూతనంగా ఏర్పాటు చేస్తున్న సీసీ రోడ్డును పరిశీలించి, చెట్లను నాటారు. ఎంపీడీఓ వనజం, ఏఓ మోహన్‌మురళి, ఏఈ సునీల్, సర్పంచ్ చిరంజీవి పాల్గొన్నారు.