
దొంగబిల్లుల రారాజు ఎవరు?
కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో కొందరు నేతల కన్ను గ్రానైట్‌పై పడింది. వారు క్వారీలపై పడి కాసులు పిండుకునే పనిలో నిమగ్నమైపోయారు. ఈ క్రమంలో రాయల్టీ వసూళ్లకు బాధ్యతలు ఉన్న సంస్థను తోసిపుచ్చారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని బిల్లులే లేకుండా చాలా వరకు గ్రానైట్‌ను అమ్ముకుంటున్నారు. దీనికితోడు దొంగ బిల్లులతో గ్రానైట్ దందాకు ఆజ్యంపోస్తున్నారు. సంస్థలు, అసోసియేషన్లను తెరపైకి తీసుకొచ్చి గ్రానైట్ దందాల్లో కోట్లాకు పడగెత్తుతున్నారు. తద్వారా రాయల్టీకి డుమ్మా కొడుతున్నారు. అయితే ఈ బినామీ సంస్థకు రూపశిల్పి... ఆ ‘రా’ రాజు ఎవరనేది ఇప్పుడు జిల్లాంతా హట్‌టాపిక్‌గా మారింది.