
పంట పొలాలపై ఏనుగుల దాడి
పులిచెర్ల(కల్లూరు): మండలంలోని కమ్మపల్లె పంచాయతీ, బాలిరెడ్డిగారిపల్లెలో శనివారం తెల్లవారు జామున ఏనుగులు స్వైర విహారం చేశాయి. దాదాపు ఆరు ఏనుగులు ఈ ప్రాంతంలో మామిడి కొమ్మలు, వరి, టమాటా పంటలను తొక్కి నాశనం చేశాయి. బాలిరెడ్డిగారిపల్లెకు చెందిన రైతులు మనోజ్, ప్రవీణ్, రమేష్ సాగు చేసిన పంటలను ధ్వంసం చేశాయి. ముఖ్యంగా ప్రవీణ్‌కు చెందిన వరి, టమాటా పంటలను తొక్కి వేయడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అటవీ అధికారులు స్పందించి ఏనుగుల బారి నుంచి పంటలను రక్షించాలని పలువురు రైతులు కోరుతున్నారు.
రాష్ట్ర స్థాయి క్రీడలకు ఎంపిక
శ్రీరంగరాజపురం: రాష్ట్ర స్థాయి సెపక్ తక్రా క్రీడలకు మండలంలోని గంగమ్మగుడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు హెచ్‌ఎం కే.కళావతి తెలిపారు. ఈ మేరకు ఎంపికై న విద్యార్థులను శనివారం పాఠశాలలో అభినందించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ అనంతపురం జిల్లా జిల్లా, ఉరవకొండలో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు కె.హేమంత్, విష్ణు, యోగనందం పాల్గొననున్నట్టు తెలిపారు. వీరికి శిక్షణ ఇచ్చిన ఉపాధ్యాయులు లోకనాథంను ప్రత్యేకంగా అభినందించారు.