
కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక
సదుం: చిత్తూరు జిల్లా జూనియర్ బాల, బాలికల కబడ్డీ జట్లను స్థానిక పోలీస్ గ్రౌండ్స్‌లో శుక్రవారం ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్షురాలు వుమత, కార్యనిర్వాహక కార్యదర్శి రవీంద్రరెడ్డి తెలిపారు. వివిధ ప్రాంతాలకు చెందిన బాలికలు 46 మంది, బాలురు 78 మంది ఈ పోటీలకు హాజరయ్యారని పేర్కొన్నారు. వారిలో ప్రతిభ చూపిన 12 మందిని ఒక్కో జట్టుకు ఎంపిక చేశామన్నారు. వీరు ఈ నెల 25వ తేదీ నుంచి గొల్లపూడిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో పీడీలు భాస్కర్, నౌషాద్, అంజినేయులు, శేఖర్, గుల్జార్, పవిత్ర పాల్గొన్నారు.

కబడ్డీ జిల్లా జట్ల ఎంపిక