
నేడు ఎస్‌ఎంసీ, క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ నెల 20వ తేదీన ఎస్‌ఎంసీ (స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ), క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహించనున్నారు. ఈ సమావేశాలను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర విద్యాశాఖాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వుల ప్రకారం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో పకడ్బందీగా సమావేశాలను నిర్వహించాలని డీఈఓ వర లక్ష్మి ఆదేశించారు. ప్రతి పాఠశాలలో మధ్యా హ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 5 గంటల వరకు క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు కచ్చితంగా నిర్వహించాలని ఆదేశించారు. ఎలాంటి అలసత్వం వహించినా చర్యలు తప్పవని డీఈఓ హెచ్చరించారు.
26లోపు మ్యాపింగ్
పూర్తి చేయాలి
చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా మ్యాపింగ్ ప్రక్రియ ఈ నెల 26వ తేదీ లోపు పూర్తి చేయాలని డీఆర్వో మోహన్ కుమార్ అన్నారు. ఈ మేరకు ఓటర్ల జాబితా ప్రక్రియపై విజయవాడ నుంచి ఎన్నికల సంఘం అధికారులు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్ అనంతరం డీఆర్వో మాట్లాడుతూ ఓటర్ల జాబితా ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలన్నారు. ఓటర్ల జాబితా ప్రక్రియలో ఎలాంటి తప్పిదాలు లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. మ్యాపింగ్ ప్రక్రియ ను నిర్ధేశించిన గడువు లోపు పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కాన్ఫరెన్స్‌లో పలువురు అధికారులు పాల్గొన్నారు.
భద్రత మరింత
పటిష్టం చేయాలి
కాణిపాకం: ఆలయ భద్రతను మరింత పటిష్టం చేయాలని ఏఎస్పీ రాజశేఖర్‌రాజు, నందకిషోర్ పేర్కొన్నారు. కాణిపాకంలోని వరసిద్ధి వినాయకస్వామి ఆలయంలో శుక్రవారం ఆక్టోపస్ మాక్ డ్రిల్‌పై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆయన ఈఓ పెంచలకిషోర్, పోలీసుశాఖ, రెవెన్యూ, అగ్నిమాపక, ఆరోగ్యశాఖల అధికారులతో ఆలయ భద్రతపై చర్చించారు. రాష్ట్ర ఆక్టోపస్ ఆధ్వర్యంలో జరిగే మాక్ ఉద్దేశాన్ని వివరించారు. కార్యక్రమంలో ఆక్టోపస్ డీఎస్పీ తిరుమలయ్య, సీఐ శ్రీధర్‌నాయుడు, ఎస్‌ఐ నరసింహులు తదితరులు పాల్గొన్నారు.
వరసిద్ధుడికి
రూ.2.39 కోట్ల ఆదాయం
కాణిపాకం: వరసిద్ధి వినాయకస్వామి ఆలయానికి రూ.2,39,09,202 ఆదాయం వచ్చినట్లు ఈఓ పెంచలకిషోర్ తెలిపారు. వరసిద్ధివినాయకస్వామివారి ఆలయంలో హుండీల లెక్కింపును శుక్రవారం అధికారులు పగడ్బందీగా చేపట్టారు. ఈ హుండీ లెక్కింపులో ఆలయానికి రూ.2,39,09,202 ఆదాయం వచ్చిందని ఈఓ తెలిపారు. 54 గ్రాముల బంగారం, 1.910 కిలోల వెండి వచ్చిందని చెప్పారు. అలాగే గోసంరక్షణ హుండీ ద్వారా రూ.29,485, నిత్యాన్నదానం హుండీ ద్వారా రూ.67,339 వచ్చిందన్నారు. 157 యూఎస్‌ఏ డాలర్లు, 12 సింగపూర్ డాలర్లు, 52 మలేషియా రింగిట్స్, 572 యూఏఈ దిర్హామ్స్, 280 కెనడా డాలర్లు, 20 ఆస్ట్రేలియా డాలర్లు, 5 యూరోలు, 15 ఇంగ్లాడ్ పౌండ్స్ వచ్చాయని ఈఓ పెంచలకిశోర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఈఓ సాగర్‌బాబు, ఏఈఓలు ఎస్వీ కృష్ణారెడ్డి, రవీంద్రబాబు, హరిమాధవరెడ్డి, ధనపాల్, ప్రసాద్, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

నేడు ఎస్‌ఎంసీ, క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు

నేడు ఎస్‌ఎంసీ, క్లస్టర్ కాంప్లెక్స్ సమావేశాలు