
భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేక పూజలు
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేక పూజ లు చేశారు. ఉదయం ఆలయ అర్చకులు అమ్మవారి గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయం 10.30 నుంచి 12 గంటల మధ్య శాస్త్రోక్తంగా అర్చన, అభిషేక పూజలు నిర్వహించారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి రాహుకాల అభిషేక పూజలకు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అనంతరం అమ్మవారిని స్వర్ణాభరణాలు, సుగంధభరి త పుష్పాలతో విశేషాలంకరణ చేసి, భక్తులకు దర్శ నం కల్పించారు. అమ్మవారి పవిత్ర తీర్థప్రసాదాలను భక్తులకు పంపిణీ చేశారు.