
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు
కాణిపాకం: ప్రత్యేక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని కాణిపాక శ్రీవరసిద్ధి వినాయకస్వామి దేవస్థానంలోని ఆస్థాన మండపంలో శనివారం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. హరికథా కాలక్షేపం, కూచిపూడి, భరతనాట్యం, గీతాలాపన, పౌరాణిక నాటిక ప్రదర్శనలు ఆహుతులను కట్టిపడేశాయి. తిరుపతికి చెందిన కలవకుంట మునిసాయికృష్ణ బృందం అన్నమాచార్య సంకీర్తనలు, ప్రత్యేక భజన పాటలు, సంగీత కచేరితో ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో సంగీత బృందం గాయని వానిష్ట, తబలా మురళీకృష్ణ, కీబోర్డు కిరణ్‌కుమార్ పాల్గొన్నారు. కాగా అద్భుత ప్రదర్శన ఇచ్చిన కళాకారులకు అధికారులు బహుమతులు ప్రదానం చేశారు.
ప్రశంసా పత్రాలతో కళాకారులు

ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు