చౌడేపల్లె: అక్రమ కేసుల నుంచి ఎంపీ పీవీ.మిథున్‌రెడ్డి కడిగిన ముత్యంలా బయటకొస్తారని జిల్లా పార్టీ ఉపాధ్యక్షుడు, జెడ్పిటీసీ సభ్యుడు ఎన్.దామోదరరాజు, మండల పార్టీ కన్వీనర్ జి. నాగభూషణరెడ్డి, వైస్ ఎంపీపీ సుధాకర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ స్పష్టం చేశారు. శనివారం అక్రమ కేసులో నుంచి మిథున్‌రెడ్డికి మధ్యంతర బెయిల్ రావడంతో ఆ పార్టీ నేతలు సంబరాలు చేసుకున్నారు. తొలుత దివంగత మహానేత డాక్టర్ వైఎస్.రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళి అర్పించారు.
బస్టాండులో బాణసంచా పేల్చి స్వీట్లు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ కుట్రలకు ప్రజలే గుణపాఠం చెబుతారన్నారు. ఇకనైనా వైఎస్సార్‌సీపీ నేతలపై అక్రమ కేసులు, దాడులు ఆపాలని సూచించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేసే బుద్ధిని ప్రసాదించాలని దేవుడ్ని కోరారు. కార్యక్రమంలో మాజీ సింగిల్‌విండో చైర్మన్ రవిచంద్రారెడ్డి, సర్పంచుల సంఘ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, ఎంపీటీసీ శ్రీరాములు, కో–ఆప్షన్ మెంబరు సాధిక్‌బాషా, సర్పంచులు ఓబుల్‌రెడ్డి, రఘురామిరెడ్డి, భాగ్యవతి, షంషీర్, నాయకులు చెంగారెడ్డి, రెడ్డెప్పరెడ్డి, షఫీ, వినోద్‌రెడ్డి, ఓబులేసు, కృష్ణప్ప, శంకరప్ప, హనుమంతురెడ్డి, అనుప్రియ, శ్రీనివాసులు, భాస్కర్, అల్తాఫ్, గిరి, భాస్కర్‌రెడ్డి, బాబు తదితరులున్నారు.