
కార్యకర్తపై దాడి
పుంగనూరు: ఆలయపనులకు చేపట్టరాదంటూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తపై టీడీపీ నేత దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన మండలంలోని గడ్డంవారిపల్లె బీసీ కాలనీలో శనివారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. గత ప్రభుత్వంలో గ్రామస్తుల వినతి మేరకు గంగమ్మ గుడి నిర్మాణ పనులు చేపట్టారు. పనులు ముగింపు దశలో ఉండగా గిరిబాబు మరికొందరితో కలిసి మదనపల్లెలో అవసరమైన టైల్స్ వేసుకొని గుడివద్దకు చేరుకున్నాడు. అదే గ్రామానికి చెందిన టీడీపీ నేత ఓబులేసు పనులు చేపట్టరాదని, టైల్స్‌ను వాహనంలో నుంచి దింపరాదని అడ్డుకున్నాడు. ప్రశ్నించిన వైఎస్సార్‌సీపీ కార్యకర్త గిరిబాబు పై దౌర్జన్యంగా దాడికి తెగబడ్డాడు. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనంతరం బాధితుడ్ని పోలీసులే పుంగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలిచారు. కేసు దర్యాప్తులో ఉంది.