
పొలాల వద్దకు వెళ్లకండి
పాతపేటలోని నటరాజ పొలంలో విరిచేసిన డ్రిప్ పరికరాలు, రెడ్డెప్ప పొలంలో ధ్వంసమైన కొబ్బరి చెట్లు
పులిచెర్ల(కల్లూరు): ఏనుగులు కల్లూరు రిజర్వు ఫారెస్టులో తిష్ట వేసి ఉన్నాయని, సమీప గ్రామాల రైతులు రాత్రి పూట పొలాల వద్దకు వెళ్లరాదని అటవీ అధికారులు సూచించారు. ప్రస్తుతం పాతపేట సమీప అటవీ ప్రాంతంలో ఏనుగులు ఉండడంతో రైతులు ఎవ్వరూ ఆ చుట్టు పక్కల సంచరించరాదన్నారు. తెలుపు రంగు దుస్తులు వేసుకొని అసలు వెళ్లకూడదని హెచ్చరించారు. ఎక్కడైనా ఏనుగులు కనిపిస్తే తరమ కూడదని, అదిలించకూడదని సూచించారు. వెంటనే ఫారెస్టు సిబ్బంది 9550067503 నంబరుకు ఫోన్ చేయాలని పేర్కొన్నారు.
పంటలు ధ్వంసం
మండలంలోని పాతపేట పంచాయతీలో శనివారం తెల్లవారు జామున ఏనుగులు పంట పొలాలపై పడి సర్వనాశనం చేశాయి. వారం రోజులుగా ఏనుగుల మంద పాతపేట, చల్లావారిపల్లె పంచాయతీల్లోని పంట పొలాలను ధ్వంసం చేస్తున్నట్టు పలువురు రైతులు వాపోతునానరు. పాతపేటకు చెందిన నటరాజ పొలంలో ఏర్పాటు చేసిన డ్రిప్ పరికరాలు, రెడ్డెప్ప పొలంలో కొబ్బరి చెట్లను విరిచివేశాయన్నారు.

పొలాల వద్దకు వెళ్లకండి