కాణిపాకం: కాణిపాకంలోని శ్రీవరసిద్ధి వినాయకస్వామిని శనివారం రాష్ట్ర పోలీసు శాఖ ఐజీ అడ్మిన్ శ్రీకాంత్ దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా వచ్చిన ఆయనకు ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి, దర్శన ఏర్పాట్లు చేశారు. డీఈవో సాగర్‌బాబు పండితుల చేతుల మీదుగా ఆశీర్వచనాలు, స్వామి చిత్రపటం, ప్రసాదం అందజేశారు.