
వాతావరణమే ముఖ్యం
టమాటా పంటకు ముఖ్యంగా సూర్యరస్మి ఉండాలి. ఇటీవల వర్షాల కారణంగా గాలిలో తేమ శాతం బాగా తగ్గింది. ఫలితంగా టమాటా తోటల్లో వైరస్ ప్రభావం పెరిగింది. పంట క్వాలిటీ దెబ్బతింటోంది. ఇలాంటి కాయలకు మార్కెట్‌లో మంచి ధర లభించదు. ముఖ్యంగా ఈ కాయలను ట్రాన్స్‌పోర్ట్ చేసేందుకు వీలుకాదు. ఎందుకంటే రెండురోజులకే ఇవి దెబ్బతింటాయి. అందుకే బయటి వ్యాపారులు ఇక్కడ కొనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. – డా.కోటేశ్వరావు,
ఉద్యానశాఖ సహాయసంచాలకులు
రూ.5 లక్షలు పెట్టుబడి పెట్టా
ఈ దఫా వేరే రైతుపొలం కౌలుకు పెట్టుకుని రూ.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టా. మూడెకరాల్లో టమాటాను సాగుచేశా. ప్రస్తుతం పంట కోత దశలో ఉంది. మొన్నటి వర్షాల కారణంగా కాయల నాణ్యత తగ్గింది. దీంతోపాట తెగుళ్లు శోకాయి. ఇప్పుడున్న ధలతో పంటకు పెట్టిన పెట్టుబడి కూడా దక్కేలా లేదు. కచ్చితంగా టమాటా రైతులు అప్పులపాలే.
– గోవిందురెడ్డి, నాగమంగళం,
పలమనేరు మండలం

వాతావరణమే ముఖ్యం