
పింఛన్ కోసం వృద్ధురాలి వేడుకోలు
పాలసముద్రం : మండలంలోని పాలసముద్రం దళితవాడకు చెందిన మునెమ్మ అనే వృద్ధురాలు పింఛన్ నగదు కోసం ఆవేదన చెందుతోంది. బుధవారం ఈ మేరకు సచివాలయం, ఎంపీడీఓ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తోంది. ప్రతి నెలా తనకు వితంతు పింఛన్ వచ్చేదని, ఈ నెల మాత్రం జాబితాలో పేరు లేదని ఆందోళన వ్యక్తం చేస్తోంది. మూడు రోజులుగా తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోతోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి పింఛన్ ఇప్పించాలని కోరుతోంది. తనకు వేరే జీవనాధారం లేదని, కనికరించాలని వేడుకుంటోంది.