
ఒక బెడ్డు.. ముగ్గురు పేషెంట్లు!
పుత్తూరు: పుత్తూరులోని వైద్య విధాన పరిషత్ ఆస్పత్రి పేరుకు 50 పడకల ఆస్పత్రిగా రికార్డుల్లో ఉన్నా, వాస్తవానికి 29 పడకలతోనే సతమతమవుతోంది. ఇక్కడ ప్రతిరోజూ 600 నుంచి 750 వరకు ఓపీ ఉంటుంది. వీరిలో కనీసం 50 నుంచి 60 మంది వరకు అడ్మిట్ అవుతారు. పుత్తూరు చుట్టు పక్కల మండలాలైన నారాయణవనం, పిచ్చాటూరు, కార్వేటినగరం, వడమాలపేట నుంచి కూడా మెరుగైన వైద్యం కోసం ఇక్కడికి రోగులు వస్తుంటారు. వీరికి సరిపడా బెడ్లు లేకపోవడంతో ఒకే బెడ్‌పై ఇద్దరు, ముగ్గురిని పడుకోబెట్టి వైద్యం అందించాల్సిన దుస్థితి నెలకొంది. మంగళవారం కూడా ఒకే బెడ్‌పై ముగ్గురిని పడుకోబెట్టి వైద్యం అందించారు.