శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు

Sep 6 2025 5:39 AM | Updated on Sep 6 2025 5:39 AM

శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు

శాస్త్రోక్తంగా పవిత్రోత్సవాలు

శ్రీకాళహస్తి : శ్రీకాళహస్తీశ్వరాలయంలో మూడవ రోజైన శుక్రవారం పవిత్రోత్సవాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. నిత్య పూజల్లో జరిగే దోషాలను సరిచేసేందుకు ఈ పూజలు చేస్తారు. అందులో భాగంగా ఆలయంలోని యాగశాలలో వేద పండితులు, అర్చకుల ఆధ్వర్యంలో శ్రీ–కాళ–హస్తి, భరద్వాజ మహర్షికి పలు రకాల అభిషేక పూజలు నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి ధూప, దీప నైవేద్యాలను సమర్పించారు. శ్రీకాళహస్తీశ్వరాలయ అధికారులు పూజా ద్రవ్యాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో వేద పండితులు, అర్చకులు, ఆలయ అధికారులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement