చిత్తూరు కలెక్టరేట్ : సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులేనని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని జెడ్పీ సమావేశ మందిరంలో విద్యాశాఖ, సమగ్ర శిక్షాశాఖల ఆధ్వర్యంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం జ్యోతి ప్రజ్వళన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది ఉపాధ్యాయులేనని, వారిని పట్టుదలతో సన్మార్గంలో నడిపించాలన్నారు. అనంతరం మేయర్ అముద, చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్‌మోహన్, పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్, డీఈవో వరలక్ష్మి, సమగ్రశిక్షా శాఖ ఏపీసీ వెంకటరమణ మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని టీచర్లు వినూత్న బోధనలను అమలు చేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారన్నారు. అనంతరం జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉత్తమ సేవలందిస్తున్న 69 మంది టీచర్లకు ప్రశంసాపత్రాలను అందించి దుశ్శాలువతో సత్కరించారు. జెడ్పీ సీఈవో రవికుమార్ నాయుడు, ఏపీఎస్‌డబ్ల్యూఆర్ జిల్లా కో–ఆర్డినేటర్ పద్మజ, డీవైఈవోలు ఇందిరా, లోకేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు.
అనధికారికంగా 15 మందికి అవార్డులు
ఉత్తమ సేవలందిస్తున్న టీచర్లకు ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరించేందుకు ముందస్తుగా పేర్లను విద్యాశాఖ అధికారులు గుర్తించి కలెక్టర్ ఆమోదం పొందుతారు. అలా ఆమోదం పొందిన టీచర్లకు మాత్రమే గురుపూజోత్సవం రోజున ప్రశంసాపత్రాలు అందజేసి సత్కరిస్తారు. అయితే శుక్రవారం జెడ్పీలో నిర్వహించిన గురుపూజోత్సవంలో 15 మందికి అనధికారికంగా అవార్డులు అందజేశారు. అది కూడా కూటమి పార్టీకి అనుకూలమైన వారికి అవార్డులు అందజేసి సత్కరించడం విమర్శలకు తావిచ్చింది. అనధికారిక అవార్డులు ఇప్పించేందుకు టీడీపీ అనుబంధ సంస్థ నోబుల్ టీచర్స్ అసోసియేషన్ నాయకుడు వ్యవహరించిన తీరు పై టీచర్లు విమర్శలు గుప్పించారు.
రాజకీయ ప్రసంగం
గురుపూజోత్సవం వేడుకల్లో పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ రాజకీయ ప్రసంగం చేయడం పట్ల విమర్శలు వెలువెత్తాయి. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి చేసిందేమి లేకపోయినా గత ప్రభుత్వాన్ని కించపరుస్తూ ప్రసగించడం విమర్శలకు తావిచ్చింది. అదే విధంగా అనధికారికంగా కార్యక్రమానికి విచ్చేసిన కూటమి నాయకులను సత్కరించడంపై విమర్శలు వెల్లువెత్తాయి.
జ్యోతిప్రజ్వళన చేస్తున్న డీఈవో వరలక్ష్మి, గురుపూజోత్సవం కార్యక్రమంలో పాల్గొన్న వివిధ ప్రాంతాల టీచర్లు
తిరుమల, చౌడేపల్లి,
ఎంఈవో–2
బాల చైతన్య, గ్రేడ్–2 హెచ్‌ఎం, జెడ్పీ కలుపల్లి, గంగవరం
సుబ్బరామయ్య, గ్రేడ్–2
హెచ్‌ఎం, జెడ్పీ జీడీనెల్లూరు
సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు
సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు
సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు
సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు
సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు
సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు
సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు
సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు
సమాజ నిర్దేశకులు ఉపాధ్యాయులు