● పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు ● పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ | - | Sakshi
Sakshi News home page

● పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు ● పాల్గొన్న కలెక్టర్‌, ఎస్పీ

Aug 6 2025 6:40 AM | Updated on Aug 6 2025 6:40 AM

● పలు శాఖల అధికారులతో  వరుస సమావేశాలు ● పాల్గొన్న కలెక్

● పలు శాఖల అధికారులతో వరుస సమావేశాలు ● పాల్గొన్న కలెక్

చిత్తూరు కలెక్టరేట్‌ : జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాల కట్టడికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌ గాంధీ ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం పలు శాఖల జిల్లా అధికారులతో కలెక్టరేట్‌లో వరుస సమీక్షలు నిర్వహించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో మిషన్‌ వాత్సల్య పథకంలో 18 ఏళ్ల లోపు పిల్లల రక్షణ, సంక్షేమం ప్రణాళిక ప్రకారం అమలు చేయాలన్నారు. జిల్లాలో అనాథ పిల్లలు, బాల కార్మికులు, భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారిని పాఠశాలల్లో చేర్పించాలన్నారు. జిల్లాలో 8 నుంచి 10 శాతం చైల్డ్‌ ప్రెగ్నెన్సీ కేసులు నమోదవుతున్నాయన్నారు. అబార్షన్‌లు సైతం జరుగుతున్నాయన్నారు. బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమంలో సమస్యాత్మక ప్రాంతాల్లో ఎంఎస్‌కేల ఆధ్వర్యంలో అవగాహన కల్పించాలన్నారు.

ధైర్యం నింపాలి

జిల్లాలో పలు చోట్ల జరుగుతున్న పోక్సో, అత్యాచార బాధిత కుటుంబాల్లో ధైర్యం నింపాలని ఎస్పీ మణికంఠ చందోలు సూచించారు. తల్లిదండ్రులు కొంత మంది మైనర్లకు వివాహాలు చేస్తున్నారని, ఇలాంటి ఘటనలు జరుగుతున్న 180 ప్రాంతాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామని చెప్పారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలకు చర్యలు చేపడుతున్నట్లు వెల్లడించారు. 80కి పైగా ప్రభుత్వ బాలికల, మహిళల సంక్షేమ వసతి గృహాలు ఉన్నట్లు చెప్పారు. వాటిని సీసీ కెమెరాలతో ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో ఐసీడీఎస్‌ పీడీ వెంకటేశ్వరి, జెడ్పీ సీఈవో రవికుమార్‌నాయుడు, డీఈవో వరలక్ష్మి, జిల్లా గిరిజన సంక్షేమశాఖ అధికారి మూర్తి పాల్గొన్నారు.

21 మందికి మిషన్‌ వాత్సల్య సహకారం

కోవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన 21 మంది పిల్లలకు మిషన్‌ వాత్సల్య పథకంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సహకారం అందిస్తున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కోవిడ్‌లో తల్లిదండ్రులను కోల్పోయిన 21 మంది పిల్లలకు జిల్లా యంత్రాంగం అండగా ఉంటుందన్నారు. ఈ పథకంలో ఒక్కొక్కరికీ రూ.20 లక్షల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు తెలిపారు. లబ్ధిపొందిన విద్యార్థులకు నగదు జమ చేసిన పోస్ట్‌ ఆఫీస్‌ పాస్‌ పుస్తకాలను అందజేశారు.

పీఎం సూర్యఘర్‌ పథకాన్ని చేరువ చేయండి

జిల్లాలోని ప్రజలకు పీఎం సూర్యఘర్‌ పథకాన్ని చేరువ చేసేలా సంబంధిత శాఖల అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. పీఎం సూర్యఘర్‌ పథకాన్ని ప్రజలకు చేరువ చేసేలా ప్రణాళికలు రూపొందించాలన్నారు. పీఎం సూర్యఘర్‌ పోర్టల్‌లో రిజిస్ట్రేషన్స్‌ ఎక్కువ సంఖ్యలో నమోదయ్యే లా చర్యలు చేపట్టాలన్నారు. పోర్టల్‌లో నమోదయ్యే దరఖాస్తులను త్వరతిగతిన పరిష్కరించాలని ఆదేశించారు. కుప్పం డివిజన్‌లోని ఫీడర్‌ స్థాయి సోలారైజేషన్‌ మొత్తం సామర్థ్యం 141 ఎంవీకి గాను 705 ఎకరాల భూమి అవసరమన్నారు. ఈ ప్రాజెక్టుకు 400 ఎకరాల భూమిని గుర్తించి మెగా ఇంజినీరింగ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ లిమిటెడ్‌కు ప్రాజెక్టును అప్పగించినట్టు వెల్లడించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ విద్యాధరి, ఏపీఎస్‌పీడీసీఎల్‌ డైరెక్టర్‌ అయూబ్‌ఖాన్‌, ప్రాజెక్ట్‌ సీజీఎం రమాదేవి, రెస్కో ఎండీ సోమశేఖర్‌ అధికారులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న కలెక్టర్‌ సుమిత్‌కుమార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement