
‘భవిత’లో పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ
గుడిపాల : భవిత కేంద్రంలోని పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సహిత విద్య కోఆర్డినేటర్ మధు తెలిపారు. బుధవారం ఆయన నరహరిపేట హైస్కూల్‌లో ఉన్న భవిత కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాల పిల్లలకు కల్పి స్తున్న వసతులపై ఆయన ఆరా తీశారు. పిల్లలకు అందిస్తున్న ప్రత్యేక శిక్షణ, స్పీచ్ తెరపి గురించి ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు. రికార్డులను తనిఖీ చేసి పిల్లల సామర్థ్యాలపై ఆరా తీశారు. గతంలో ప్రస్తుత స్థితిగతులు, ఫిజియోధెరపీ వల్ల కలిగే లాభాల గురించి తెలుసుకున్నారు. ఆయనతో పాటు ఎంఇఓలు హసన్‌భాషా, గణపతి, ఎఎస్‌ఓ చాంద్‌బాషా, హెచ్‌ఎం దూర్వాసు పాల్గొన్నారు.