
అలుపెరుగని అక్షర సేనాని శ్రీనివాస్
పలమనేరు: అలుపెరుగని అక్షరసేనాని డా.శ్రీనివాస్ అని పలమనేరు రచయితల సంఘనేత పలమనేరు బాలాజీ పేర్కొన్నారు. ఆ మేరకు పట్టణంలోని లయన్స్ సేవా కేంద్రంలో శుక్రవారం కేఎన్.జయమ్మ స్ఫూర్తి పురష్కారాన్ని ఆయన అందుకున్నారు. ఆయన మాట్లాడుతూ.. పత్రికా సంపాదకులుగా, సాహిత్య సామాజిక విశ్లేషకుడిగా ఆయన సాహిత్య ప్రస్థానం ఎందరికో స్ఫూర్తిదాయకమన్నారు. పురష్కార గ్రహీత డా.శ్రీనివాస్ మాట్లాడుతూ తనకు జయమ్మ పురష్కారం రావడం ఆనందంగా ఉందన్నారు. రచయితలు ఉమామహేశ్వరావు, వెంకటకృష్ణ, సుంకోజి దేవేంద్రాచారి, రాఘవశర్మ, బాలసుబ్రమణ్యం, నెమిలేటికిట్టన్న, బాబ్జీ, కొత్తపల్లి సురేష్, కృష్ణమూర్తి, జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి, పల్లిపట్టు నాగరాజుతోపాటు స్థానిక రచయితలు గండికోట వారిజ, సంధ్యారాణి, పవిత్రతోపాటు పలు ప్రజాసంఘాలు పాల్గొన్నాయి.