
విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ఐరాల: విద్యుత్ షాక్‌తో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం మండలంలోని కాకర్లవారిపల్లెలో చోటుచేసుకుంది. కాణిపాకం పోలీసుల కథనం మేరకు.. కాకర్లవారిపల్లెకు చెందిన జానకీరామ్(53) వ్యవసాయ పనులతో జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం తమ ఇంటి పక్కన ఉన్న సొంత భూమిలో పశువులను మేతకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో పొలంలో విద్యుత్ తీగలు తెగిపడి ఉండడంతో చేతితో వాటిని పక్కకు తీసివేస్తుండగా కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
గుండెపోటుతో అటెండర్ మృతి
గంగాధరనెల్లూరు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో అటెండర్‌గా విధులు నిర్వహిస్తున్న మగ్గం నవీన్‌కుమార్ (31) గుండె పోటుతో మృతి చెందారు. మదనపల్లికి చెందిన ఆయన తన తండ్రి మరణంతో కారుణ్య నియామకాల కింద ఉద్యోగంలో చేరారు. శుక్రవారం ఉదయం మదనపల్లిలో గుడికి వెళ్లేందుకు సిద్ధమవుతూ ఇంట్లోనే కుప్పకూలిపోయాడు. నవీన్‌కుమార్ మృతికి స్థానిక అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
‘ఎర్ర’ స్మగ్లర్ల అరెస్ట్
తిరుపతి మంగళం : అక్రమంగా తరలిస్తున్న ఎర్ర చందనంతో పాటు ముగ్గురు స్మగ్లర్లను శుక్రవారం తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆదేశాల మేరకు డీఎస్పీలు ఎండీ షరీఫ్, శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆర్‌ఐ సాయి గిరిధర్‌కు చెందిన ఆర్‌ఎస్‌ఐ టీ. విష్ణువర్ధన్ కుమార్ బృందం స్థానిక ఎఫ్‌బీఓ కె.వేణుగోపాల్‌తో కలిసి శుక్రవారం కూంబింగ్ చేపట్టారు. సత్యవేడు అటవీ ప్రాంతంలో తెల్లవారుజామున జంబుకేశ్వరపురం నీలగిరి తోట వద్ద రెండు మోటారు సైకిళ్లతో కొంత మంది వ్యక్తులు కనిపించగా వారిని చుట్టుముట్టే ప్రయత్నం చేయగా వారిలో కొందరు పారిపోయారన్నారు. అయితే ముగ్గురిని పట్టుకున్నట్లు తెలిపారు. వారు సమీపంలో దాచిన 24 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన వారిలో ఒకరు తిరుపతి జిల్లాకు చెందిన వ్యక్తి కాగా, మరో ఇద్దరు తమిళనాడుకు చెందిన వారిగా గుర్తించారు. వారిని దుంగలతో సహా తిరుపతి టాస్క్‌ఫోర్స్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఎస్‌ఐ రఫీ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి