
ద్రౌపదమ్మకు పట్టువస్త్రాల సమర్పణ
పుత్తూరు: ద్రౌపదీదేవి సమేత ధర్మరాజస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా మంగళవారం స్వామి, అమ్మవార్ల కల్యాణోత్సవాన్ని పురస్కరించుకొని మాజీ మంత్రి ఆర్కే రోజా పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా బజారు వీధిలోని సెల్వ వినాయకస్వామికి పూజలు నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాలు, బాణ సంచా సందడి నడుమ ఊరేగింపుగా ఆలయానికి చేరుకొని సారె సమర్పించారు. స్వామి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి, తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం రోజాను ఆలయ నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా రోజా మాట్లాడుతూ గత 11 ఏళ్లుగా అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పిస్తున్నానని తెలిపారు. అమ్మ ఆశీర్వాదంతోనే ఇలా ఏటా పట్టువస్త్రాలు సమర్పించడం జరుగుతోందని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ హరి, వైస్ చైర్మన్లు శంకర్, జయప్రకాష్, ఎంపీపీ మునివేలు, వైస్ ఎంపీపీ మునస్వామిరెడ్డి, వైఎస్సార్‌సీపీ పట్టణ, రూరల్ పార్టీ అధ్యక్షుడు ఏకాంబరం, అన్నాలోకనాథం, కౌన్సిలర్లు కె.రాధ, జయలక్ష్మి, భానుమతి, హేమలత, రాజేశ్వరి, రాధ, పవన్, గుణ, నాయకులు దిలీప్‌మొదలి, లోకనాథం, లారీమోహన్, మనోహర్‌రెడ్డి, శ్రీనివాసులురెడ్డి, జయచంద్రన్, భాస్కర్‌యాదవ్, ఈశ్వరయ్యయాదవ్, గణేష్, చక్రపాణి, చిన్నా, ప్రసాద్, మురళీయాదవ్, వెంకటేశులు, శివలింగం, మీసాలురెడ్డి, కడియాలనాయుడు, లక్ష్మణమూర్తి, శివ, వెంకటేష్, బొజ్జయ్య, కిషోర్, తిరునావకర్సు, అపరంజి, గోవిందస్వామిరెడ్డి, రాంబత్తయ్య పాల్గొన్నారు.
అట్టహాసంగా పట్టువస్త్రాలు సమర్పించిన మాజీ మంత్రి ఆర్కే రోజా
ఆలయ మర్యాదలతో సత్కరించిన నిర్వాహుకులు

ద్రౌపదమ్మకు పట్టువస్త్రాల సమర్పణ